Kabzaa 1st Day Collections: కబ్జా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్
Kabzaa 1st Day Collections: స్టార్ నటులు ఉపేంద్ర,సుదీప్,శివ రాజ్ కుమార్ లు నటించిన లేటెస్ట్ మూవీ కబ్జా. ఈ శుక్రవారం అంటే మార్చి 17న థియేటర్లలో రిలీజ్ అయింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నాట ఆ స్థాయిలో ఆసక్తి రేపిన మూవీ కావడంతో ఈ సినిమా కూడా మరో కేజీఎఫ్ అవుతుందని అంతా నమ్మారు..కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ మాత్రం పరవాలేదనిపించింది.
ఈ సినిమా తొలిరోజు కర్ణాటకలో 8 కోట్ల గ్రాస్, తెలుగులో 1.5 కోట్ల గ్రాస్, హిందీలో 1.2 కోట్లు, మలయాళంలో 15 లక్షలు, తమిళంలో 25 లక్షల వసూళ్లను నమోదు చేసింది. ఓవరాల్‌గా ఫస్ట్‌డే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 13 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 45 కోట్ల దాకా ఉంటుందని అంటూ ఉండగా ఈ మొత్తాన్ని రికవరీ చేయాలి అంటే సినిమా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. కానీ మిక్స్డ్ టాక్ రావడంతో మరి ఈ సినిమా భారీవసూళ్లను అందుకుంటుందా? లేదా అనేది చూడాలి. ఇక ఈరోజు రేపు వసూళ్లనుబట్టి రాబోయే రోజుల్లో ఈసినిమా కలెక్షన్స్ భవితవ్యం తేలనుంది.