Jr NTR Tweet: మావయ్యా అంటూ జూ. ఎన్టీఆర్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్!
Jr NTR Tweet Mentioning Chandrababu As Mavayya: చంద్రబాబు జూనియర్ ఎన్ఠీఆర్ తో త్వరలో భేటీ కాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో చంద్రబాబును మామయ్యా అని ఆప్యాయంగా పిలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ ట్వీట్ రిప్లై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన కో స్టార్ రామ్ చరణ్ తో కలిసి అద్భుతంగా డాన్స్ చేసిన నాటు నాటు పాటకు ఆస్కార్ తర్వాత అంతటి ప్రతిష్టాత్మక అవార్డుగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. ఆ విషయంపై చంద్రబాబునాయుడు ఉదయం మూవీ టీంను అభినందిస్తూ ఒక ట్వీట్ చేయగా ఇప్పుడు ఆ ట్వీట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రిప్లై ఇచ్చారు.
‘’ధ్యాంక్యూ సోమచ్ మామయ్యా అని బాబును ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం జగన్ కూడా ఆర్ఆర్ఆర్ టీంని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగ ఆ ట్వీట్స్ కి కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రధాని మోదీకి కూ స్పందించి.. రీట్వీట్ చేశారు. ధ్యాంక్యూ సార్ హానర్డ్ అని పేర్కొనగా సీఎం జగన్‌కు ధ్యాంక్యూ సార్ అని రిప్లయ్ ఇచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రధాని మోదీ , సీఎం మోదీలు.. అవార్డు వచ్చిన విషయాన్ని చెబుతూ.. చేసిన ట్వీట్‌లో ఎన్టీఆర్ ను కూడా ట్యాగ్ చేయగా చంద్రబాబు చేసిన ట్వీట్‌లో ఎన్టీఆర్,రామ్ చరణ్ సహా ఎవర్నీ ట్యాగ్ చేయలేదు, కేవలం కీరవాణితో పాటు రాజమౌళిని మాత్రమే ట్యాగ్ చేసినా ఎన్టీఆర్ స్పందించడం చర్చనీయాంశం అయింది.
Thank you so much mavayya.
— Jr NTR (@tarak9999) January 11, 2023