Jr.NTR: హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్.. గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన అభిమానులు
Jr.NTR: కొద్ది రోజులుగా ఆస్కార్ అవార్డ్స్ కోసం అమెరికాలో సందడి చేసిన తారక్.. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ఫ్యాన్స్. భారతీయ సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం ఇండియా చేరుకుంటున్నారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్’ టీంలో సభ్యుడిని అయినందుకు గర్వంగా ఉందని, ఆస్కార్ అవార్టు ప్రకటించిన క్షణాన్ని మరిచిపోలేనన్నారు.
ఆస్కార్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు ఎన్టీఆర్. రాజమౌళి చేతిలో ఆస్కార్ చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని.. నాటు నాటు పాటకు అవార్డ్ అనౌన్స్ చేసినప్పుడు ఆనందాన్ని తట్టుకోలేకపోయామని అన్నారు. ఈ విషయాన్ని మొదట తన భార్యకు ఫోన్ చేసి చెప్పానని అన్నారు. ఈ ఆనందక్షణాల్లో తన కంటి నుంచి నీరు వచ్చిందన్నారు. నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఆస్కార్ అందుకొని స్టేజి కిందకు వచ్చిన ఎంఎం కీరవాణి తనను హత్తుకున్న క్షణం జీవితంలో మరిచిపోలేనన్నారు. విశ్వవేదికపై తెలుగుపాట అసలు వింటానని అనుకోలేదన్నారు. ఇకపై బాధ్యత మరింత పెరిగిందన్నారు.
#NTR back to HYD fans welcomed in style 😎🐯 @tarak9999 #GlobalStarNTR pic.twitter.com/VYQ2m5rFZE
— UK NTR Fans (@UKNTRfans) March 14, 2023