Jr NTR: ఆస్కార్ దాకా వెళ్ళామంటే తెలుగు జాతి కారణం!
Jr NTR: ధమ్కీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడింది, ఆస్కార్ అవార్డ్ వచ్చింది అంటే రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, ప్రేమ్ రక్షిత్ ఎంత కారణమో తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా అంతే కారణం అని అన్నారు. అలాగే యావత్ తెలుగు జాతి కారణం.. అభిమానుల అభిమానం కారణమని అన్నారు. ఆర్ఆర్ఆర్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్న ఆయన ఆస్కార్ వేదిక పై చంద్రబోస్ కీరవాణి లను చూసి నప్పుడు ఇద్దరు భారతీయులు ఆ అవార్డ్ తీసుకున్నారు అనిపించిందని అన్నారు.
విశ్వక్ సేన్ సినిమాలు నాకు చాలా ఇష్టం అని పేర్కొన్న ఆయన తనను తాను ప్రూవ్ చేసుకోవాలని తపన పడుతూ ఉంటాడని అన్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ గా కూడా అతను చేశాడు ఇక ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తాను డైరెక్ట్ చేయకుండా ఇంకొకరికి అవకాశం ఇవ్వాలని కోరారు. తెలుగు పరిశ్రమ అద్భుతమైన స్థానంలో ఉందని, ఈ సినిమా ఉగాది కి రిలీజ్ అవుతుంది విశ్వక్ సేన్ కి పండుగ అవ్వాలి అని అన్నారు. ఆర్ఆర్ఆర్ ని ప్రతి ఒక్కరు తమ సినిమా గా భావించారని, అందుకే ఆస్కార్ వేదికపై తెలుగుదనం ఉట్టిపడిందని అన్నారు. ఇకపై భారతీయ సినిమాలు ఆస్కార్ వేదికపై మెరుస్తాయని ఎన్టీఆర్ పేర్కొన్నారు.