Good Luck Jerry Movie trailer review: సినిమాపై ఆసక్తిని పెంచిన ట్రైలర్, అమాయక పాత్రలో అదరగొట్టిన జాన్వీ
దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గుడ్ లక్ జెర్రీ’ ట్రైలర్ డిస్నీ+ హాట్‌స్టార్ లో తాజాగా విడుదలైంది. బ్లాక్ కామెడీ టచ్ కలిగిన జానర్లో గుడ్ లక్ జెర్రీ తెరకెక్కింది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్లో జాన్వీని జయకుమారిగా చూపించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చూసుకోవడానికి ఉద్యోగం కోసం ఎంతకైనా తెగించే బీహార్‌కు చెందిన అమాయక అమ్మాయి పాత్రలో జాన్వీ అదరగొట్టింది. జాన్వితో పాటు దీపక్ డోబ్రియాల్, మితా వశిష్ట్, సుశాంత్ సింగ్ లు కీలక పాత్రల్లో నటించారు. నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘కొలమావు కోకిల’ చిత్రానికి ‘గుడ్ లక్ జెర్రీ’ హిందీ రీమేక్.
జాన్వి ఉద్యోగం కోసం డ్రగ్స్ ముఠా వద్దకు వెళ్లడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ ఉద్యోగం మహిళలకు కాదని తెలుసుకుని తన కుటుంబం కోసం మసాజ్ సెంటర్లో పనిచేస్తున్నట్టు జాన్విని చూపెట్టారు.ఇక జాన్వీ తన తల్లికి స్టేజ్ 2 ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు తెలియటంతో డబ్బు కోసం డ్రగ్ డీలర్‌గా మారే క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. తమిళంలో నయనతారని ప్రేమించే ప్రముఖ కమెడియన్ యోగిబాబు పాత్రలో దీపక్ డోబ్రియాల్ అద్భుతంగా నటించాడు. నయనతారని వన్ సైడ్ లవ్ చేస్తూ.. డ్రగ్స్ దందాలో ఎలా ఇరుక్కొన్నాడో ఎంటర్టైనింగ్గా చూపెట్టారు. ఇక జూలై 29న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ డార్క్ కామెడీ మూవీ గుడ్ లక్ జెర్రీని స్ట్రీమింగ్ చేయనున్నారు.