#JawanTrailer:బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జవాన్`. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.
#JawanTrailer:బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `జవాన్`. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ ఈ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలన్‌గా నటిస్తుండగా ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కథకు కీలకమైన అతిథి పాత్రల్లో దీపికా పదుకోనె, సంజయ్‌దత్‌లతో పాటు తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా నటించారు.
ఇప్పటిరే ప్రివ్యూ పేరుతో విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. డిఫరెంట్ గెటప్‌లతో షారుక్ సరికొత్త పాత్రల్లో కనిపిస్తుండటంతో `జవాన్` బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. భారీ స్థాయిలో ఈ మూవీని సెప్టెంబర్ 7న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగానే రీసెంట్గా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించిన మేకర్స్ గురువారం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాపై `జవాన్` ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం.
ఇప్పటికే సినిమాపై రెండు ట్రైలర్లని వదిలిని టీమ్ కథేంటీ? అనే విషయాన్ని మాత్రం బయటపెట్టకుండా చాలా జాగ్రత్తగా ట్రైలర్లని కట్ చేసి ప్రేక్షకుల్లో, షారుక్ అభిమానుల్లో `జవాన్`పై అంచనాల్ని పెంచేసింది. నాలుగేళ్ల విరామం తరువాత షారుక్ నటించిన `పఠాన్` బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద సంచలనంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి షారుఖ్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.
దీంతో `పఠాన్` తరువాత వస్తున్న `జవాన్`పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేస్తోంది. సినిమాలో షారుక్ ద్విపాత్రాభినయం చేసినట్టుగా స్పష్టమవుతోంది. అబ్బుర పరిచే విజువల్స్‌తో తొలి ట్రైలర్‌ని అరణ్యం నేపథ్యంలో ప్రారంభించిన అట్లీ రెండవ ట్రైలర్‌ని కూడా అదే నేపథ్యంలో ప్రారంభించాడు. `అనగనగా ఒక రాజు..ఒకదాని తరువాత ఒకటి యుద్దం ఓడిపోతూనే ఉన్నాడు. దాహంతో..ఆకలితో..అడవిలో తిరుగుతున్నాడు.
అతను చాలా కోపంగా ఉన్నాడు… అనే డైలాగ్‌లతో ట్రైలర్ మొదలైంది. ముంబయిలో హైజాక్ ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. తండ్రీ కొడుకులుగా షారుక్ నటించిన ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించారు. `నేను విలనై నీ ముందుకొచ్చాను… మేం జవాన్లం..మా ప్రాణాలని ఒక్కసారి కాదు వెయ్యి సార్లైనా పోగొట్టుకుంటాం. అదీ దేశం కోసమే…కానీ మీలాంటి వాళ్లు దేశాన్ని అమ్ముకుంటూ పోతూ ఉంటే..మీ లాభాల కోసం మా ప్రాణాలని త్యాగం చేయలేం…నా కొడుకు మీద చెయ్యివేసే ముందు ఆడి బాబు మీద చెయ్యివేయ్..` అంటే రెండు క్యారెక్టర్లలో షారుక్ నట విశ్వరూపం చేపించాడు. ట్రైలర్లో కథేంటో చెప్పకపోయినా ఈ సారి కూడా షారుక్ `పఠాన్` తరహాలో బిగ్ బ్యాంగ్‌తో వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్‌గా నిలుస్తోంది.