ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, తమిళ దర్శకుడు అట్లీ కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన జవాన్ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు తిరగరాస్తోంది. పఠాన్ సృష్టించిన కలెక్షన్ల సునామీ తర్వాత వస్తుండటంతో జవాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jawan Movie : ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్( Indian Superstar Sharuk khan), తమిళ దర్శకుడు అట్లీ(Tamil Director Atlee)కుమార్ కాంబినేషన్‌లో రూపొందిన జవాన్ మూవీ రిలీజ్‌కు(Jawan Movie Release) ముందే రికార్డులు తిరగరాస్తోంది. పఠాన్ సృష్టించిన కలెక్షన్ల సునామీ తర్వాత వస్తుండటంతో జవాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు(Advance Booking) అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ సినిమా బడ్జెట్(Movie Budget), అడ్వాన్స్ బుకింగ్ వివరాలు(Advance Booking Details), తొలి రోజు కలెక్షన్ల అంచనాల విశేషాల్లోకి వెళితే..
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్‌లో ముందుగా ప్రారంభించారు. యూఏఈ, యూఎస్ఏ, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకేలో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టగానే అభిమానుల నుంచి భారీ రెస్సాన్స్ లభించింది. అమెరికాలో ఈ సినిమాకు భారీ, రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతోంది. అమెరికాలో(America) జవాన్ మూవీకి వస్తున్న స్పందన చూస్తే.. రిలీజ్ డేట్ నాటికి భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి 500 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. ప్రస్తుతానికి ఈ సినిమా 250,000 డాలర్లు అంటే సుమారు 2 కోట్ల వరకు కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
ఇక మహారాష్ట్ర(Maharastra) ప్రధానంగా ముంబైలో గ్రాండ్‌గా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఐనాక్స్ మాల్స్‌లో తొలి రోజు సుమారు 10 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి మొదలై.. చివరి ఆట 10.40 గంటలకు మొదలవుతుంది. మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా టికెట్ ధర 1100 రూపాయలుగా నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ 80 శాతం పూర్తయింది. మహారాష్ట్ర మినహాయిస్తే.. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా బుకింగ్ ప్రారంభించాల్సి ఉంది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఆహ్మాదాబాద్, చండీగఢ్, పూణె, చెన్నై, కోల్‌కతా, కోచీలో అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టాల్సి ఉంది. అభిమానులు సౌత్‌లో ఎప్పుడెప్పుడా అనే విధంగా వెయిట్ చేస్తున్నారు.
జవాన్ మూవీ తొలి రోజు రికార్డు కలెక్షన్లు(Record collections) వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు 55 కోట్లు వసూలు చేసింది. అయితే జవాన్ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 75 కోట్ల మేర వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు. అదే జరిగితే బాలీవుడ్ సినిమా రంగంలో అత్యధికంగా తొలి రోజు కలెక్షన్లు సాధించిన చిత్రంగా జవాన్ రికార్డు సాధిస్తుంది. ఇదిలా ఉండగా, జవాన్ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణకు అన్నీ ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దుబాయ్‌లో బూర్ఝ్ ఖలీఫా వద్ద ఆగస్టు 31వ తేదీన 9 గంటలకు ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. దీపిక పదుకోణె, సంజయ్ దత్, దళపతి విజయ్ తదితరులు ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సెప్టెంబర్ 7వ తేదీన హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.