Janhvi Kapoor: ఆ ఒక్క మాట నన్ను చాలా బాధ పెట్టింది
Janhvi Kapoor Talks About Being Called Vulgar In Post-Workout Clothing Pics: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ సేన్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 29 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్తున్నారు. ఇది తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనను బాధ పెట్టిన ఒక కామెంట్ గురించి జాన్వీ చెప్పుకొచ్చింది.
శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరిచయమైన ఈ భామ ఫ్యాషన్ ఐకాన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇక నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆ ఫోటోలపై ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదట. అయితే ఒక సమయంలో మాత్రం ఒక పదానికి చాలా బాధ పడినట్లు చెప్పుకొచ్చింది. తాను జిమ్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను ఫొటోగ్రాఫర్లు క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది తన డ్రెసింగ్ స్టైల్ బావుంది అన్నా కొంతమంది మాత్రం వల్గర్ గా ఉంది ని కామెంట్స్ చేయడంతో చాలా బాధపడ్డట్లు చెప్పుకొచ్చింది. నా చిన్నతనం నుంచే చిత్ర పరిశ్రమకు చాలా దగ్గరగా ఉన్నాను. కానీ ఇన్నేళ్ల కాలంలో ఆ ఒకే ఒక్క పదం తనును చాలా బాధకు గురి చేసింది అని తెలియజేసింది. ఇక అమ్మడు ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా జాన్వీకి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.