Prabas v/s Allu Arjun: ప్రభాస్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య పోస్టర్ వార్
Prabas v/s Allu Arjun’s Poster War: ‘బాహుబలి’ నుండి సౌత్ సినిమాల హవా నడుస్తుంది.పాన్ ఇండియా లెవల్లో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్అందుకుంటున్నాయి. దేశం మొత్తం సౌత్ సినిమాలపై చర్చలు పెడుతున్నారు.తాజాగా ‘పుష్ప’ సాధించిన విజయం అంత ఇంతాకాదు అల్లు అర్జున్ కెరీర్ లో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఇండియా టుడే తాజా మ్యాగజైన్ పై అల్లు అర్జున్ కవర్ పేజీ వేసి సౌత్ స్వాగ్ అని పేర్కొంది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. ఈ పోస్టర్ తో పాటు‘పుష్ప సినిమా వసూళ్ళనూ పేర్కొన్నారు. అయితే ఇందులో విశేషమేముంది అని అనుకోవచ్చు. కానీ.. ఐదేళ్ళ క్రితం ప్రభాస్ నటించిన ‘బాహుబలి-2’ విడుదలయ్యాక ఇదే ‘ఇండియా టుడే’ కవర్ పై ప్రభాస్ ఫొటో కవర్ పేజ్ కనిపించింది. ఆ సమయంలో ‘ఎపిక్ బ్లాక్ బస్టర్’ అని పేర్కొనగా, ఇప్పుడు అల్లు అర్జున్ కవర్ తో వచ్చిన సంచికపై ‘ద సౌత్ స్వాగ్’ అని రాశారు.
బాహుబలి 2 సినిమా విడుదలైన తర్వాత విజయానికి కారణమైన స్టోరిని మాత్రమే కవర్ స్టోరీగా రాశారు. ఈ కారణంతో ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలయ్యింది. బన్నీ ఇప్పుడు కవర్ పేజీ పై కనిపించాడు కానీ ప్రభాస్ ఐదేళ్ల కిందటనే కనిపించాడు అనే చర్చ మొదలైంది.
ఈ వివాదాన్ని ఒక న్యూస్ ఛానెల్ స్పెషల్ స్టోరీగా ఓ అరగంట పాటు ప్రసారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియా టుడే ఎంటర్ టైన్ మెంట్ బ్యూరో దీపాలీ పటేల్, డిప్యూటీ ఎడిటర్ సుహానీ సింగ్, స్పెషల్ కరస్పాండెంట్ నబిలా జమాల్, ప్రముఖ నటి కస్తూరి, ఇండియా టుడే ఛీఫ్ ఫోటోగ్రాఫర్ అక్షిత నందగోపాల్ పాల్గొన్నారు.సౌత్ ఇండస్ట్రీలో ఇలా అభిమానుల మధ్య ఎప్పుడు ఎదో ఒక గొడవ జరగడం సర్వసాధారణమే అని దీపాలి పటేల్ పేర్కొంది. పుష్ప సినిమా గురించి ఇప్పటికీ మాట్లాడుకోవడానికి గల కారణం పుష్ప సినిమా సీక్వెల్ రాబోతుంది అని వెల్లడించింది.
సౌత్ సినిమా విజయాలను చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ వెనకడుగు వేస్తోందని దీపాలి పటేల్ పేర్కొన్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాలీవుడ్ సూపర్ హీరోల అభిమానుల మధ్య జరుగుతున్న వార్ గురించి ఈ చర్చ జరగడం ఒకందుకు శుభపరిణామమే అంటున్నారు సినీ పెద్దలు. ఒక్కప్పుడు బాలీవుడ్ స్టార్స్ గురించి మాట్లాడే నేషనల్ మీడియా వర్గాలు ఇప్పుడు సౌత్ హీరోల గురించి చర్చ చేయడం మంచిదే అన్నారు… కానీ ఫాన్స్ మాత్రం ఈ పోస్టర్స్ పై వివాదాలు చేయడం తగదన్నారు.మరి ఈ రచ్చపై ఈ సూపర్ హీరోస్ రిప్లై ఇస్తారా లేదా ? చూడాలి.