నడిరోడ్డుపై మంచు మనోజ్ కారు ఆపిన పోలీసులు.. ఎందుకంటే..?
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ కారును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో మంచు మనోజ్ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉందని గుర్తించిన పోలీసులు ఆయన కారును అడ్డుకున్నారు. దీంతో మనోజ్ కారుకు రూ. 700 ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. అలాగే మనోజ్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తెరను తొలగించారు. ఇక ఇటీవలేఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ కార్లను అడ్డుకొని బ్లాక్ ఫిల్మ్ ని తొలగించిన సంగతి తెలిసిందే. వై కేటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మినహా ఇతరులెవరూ వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించరాదని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కానీ పలువురు ప్రముఖులు అభిమానుల తప్పించుకోవడానికి కారుకు బ్లాక్ ఫిల్మ్ వేయించుకొని తిరుగుతున్నారు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.