Pushpa 2:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ `పుష్ప 2`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.
Pushpa 2:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ `పుష్ప 2`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. కీలక పాత్రలో పవర్ ఫుల్ విలన్‌గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించనుండగా, ఇతర పాత్రల్లో కన్నడ నటుడు ధనుంజయన్, అనసూయ, సునీల్ కనిపించనున్నారు.
ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాలని మారేడుమిల్లి ఫారెస్ట్‌లో పూర్తి చేశారు. ఫహద్ ఫాజిల్‌తో పాటు మరి కొంత మంది కీలక ఆర్టిస్ట్‌లు పాల్గొనగా ప్రధాన సన్నివేశాలని పూర్తి చేశారు. దీంతో ఫహద్ కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. బన్నీకి సంబంధించిన కీలక షూటింగ్ జరుగుతోంది. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన `పుష్ప 2` కాన్సెప్ట్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది. `పుష్ప`లో బన్నీని ఓ సాధారణ కూలివాడిగా చూపించి ఆ తరువాత సిండికేట్‌కు నాయకుడిగా ఎదిగే క్రమాన్ని చూపించాడు దర్శకుడు సుకుమార్.
అయితే పార్ట్ 2లో మాత్రం డాన్‌గా ఎదిగి రాబిన్ హుడ్ తరహా పాత్రలో అల్లు అర్జున్‌ని చూపించబోతున్నారట. రీసెంట్‌గా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ఈ విషయాన్ని స్పష్టంచేసింది. దేశ విదేశాల్లో భారీ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పేరు మోసిన స్మగ్లర్‌గా బన్నీ ఇందులో కనిపించనున్నారని తెలుస్తోంది. బ్యాంకాక్, థాయ్‌లాండ్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదిలా ఉంటే `పుష్ప` సంచలన విజయం సాధించడంతో `పుష్ప 2`పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఉత్తరాది హక్కుల విషయంలో అక్కడి వర్గాలు భారీ ఆఫర్లు ఇస్తున్నారట. అంతే కాకుండా ఓవర్సీస్ వర్గాలు కూడా `పుష్ప 2` రైట్స్ కోసం ఊహించని ఆఫర్లు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్‌కు చెందిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఓవరాల్ ఓవర్సీస్ హక్కుల కోసం భారీ స్థాయిలో ఆఫర్ చేశారని, రూ.90 కోట్లు ఆఫర్ చేశారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓవర్సీస్ హక్కుల కోసం ఈ స్థాయి ఆఫర్ ఓ సినిమాకు రావడం ఇదే మొదటి సారి కావడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇందులో ఉన్న నిజమెంత?..సినిమాపై హైప్ కోసమే ఈ ప్రచారం జరుగుతోందా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది.