RRR Oscar Promotions: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్‌కు అంత ఖర్చు అవసరమా?
How Director RajaMouli promoted RRR Movie for Oscar Awards
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన RRR మూవీ మరో ఘనత సాధించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డును అందుకున్నారు.
RRR మూవీ సంచలన విజయం సాధించి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. కనీవిని ఎరుగని రీతిలో ఆదరణ సొంతం చేసుకుంది. అనేక దేశ ప్రజలను అబ్బురపరిచింది. ఓటీటీలో కూడా దుమ్ముదులిపింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుని మరోసారి వార్తల్లో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డును అందుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న సినిమాలు దాదాపుగా ఆస్కార్‌ను కూడా గెలిచుకుంటాయి. దీంతో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ఆస్కార్ గ్యారంటీ అని అనేక మంది సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్‌కు భారీ ఖర్చు అయినట్లు తెలుస్తోంది. భారతీయ భాషల్లో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కోసం ప్రచారానికి 20 కోట్ల ఖర్చు అయితే.. అదే సినిమా ఆస్కార్ ప్రమోషన్‌కి మాత్రం 50 కోట్లు అయినట్లు తెలుస్తోంది. ఆ మొత్తంతో ఓ మీడియమ్ బడ్జెట్ సినిమా తీయవచ్చని సినీ పండితులు చెబుతున్నారు . ఆస్కార్ ప్రమోషన్‌కు అయిన ఖర్చు విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు వస్తే చాలా పెద్ద విషయమని, దేశం గర్వించే స్థాయిగల అవార్డని కూడా మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
పక్కా ప్లానింగ్‌తో బరిలో దిగిన రాజమౌళి
సినీ పరిశ్రమలో ఉన్నవారు ఆస్కార్ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన ఏ సినిమా కూడా ఆస్కార్ అవార్డు దక్కించుకోలేదు. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోగల సత్తా ఉన్నప్పటికీ అనేక సినిమాలు బరిలో నిలవలేకపోయాయి. దానికి కారణం ఆస్కార్ ప్రమోషన్‌కు అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉండడమే.
రాజమౌళి మాత్రం ఖర్చు విషయంలో తగ్గేదే లే అంటూ రంగంలో దూకాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన గుర్తింపును దృష్టిలో పెట్టుకుని ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచాడు. పక్కా ప్రణాళికతో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పోయాడు. ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచాడు. ఖర్చు వెనకాడకుండా ప్రమోట్ చేశాడు. ఖర్చు ఎక్కువైనా, ఆస్కార్ అవార్డును టార్గెట్ చేశాడు. ఆడియెన్స్ నుంచి వచ్చిన అభినందనలు, విమర్శకుల నుంచి సైతం వచ్చిన ప్రశంసలు ఆస్కార్ వైపు నడిచేలా రాజమౌళిని పురిగొలిపాయి. రాజమౌళి మార్కెటింగ్ స్కిల్ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. ఆస్కార్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా అవగాహన చేసుకున్నాడు. ప్రచారాన్ని ఉధృతం చేశాడు.
ఈ నెల 24వ తేదీన ఆస్కార్ నామినేషన్ల లిస్టు విడుదల కానుంది. ఆ జాబితా విడుదలైన తర్వాత ఆర్‌ఆర్‌ఆర్ ఎన్ని అవార్డులు సాధించనుందో తేలనుంది.