Liger: చిరంజీవి, ప్రభాస్ చేతులమీదుగా రానున్న ‘లైగర్’ ట్రైలర్
Chiranjeevi, Prabhas Releasing Liger Telugu Trailer:మరికొద్ది నిమిషాల్లో ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఉదయం హైదరాబాదులో సాయంత్రం ముంబైలో ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ‘లైగర్’ తెలుగు ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు విజయ్ ఫాన్స్ 75 అడుగుల కటౌట్ పెట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్ చేతుల మీదగా తెలుగు ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి.పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.
ఈ సినిమాలో ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నాడు. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా హీరో ప్రయాణం ‘లైగర్’ లో చూపించనున్నట్లు తెలుస్తోంది.విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఆగస్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా.. ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి.ఇక చిరంజీవి .ప్రభాస్ చేతులమీదుగా వేడుక నిర్వహించడం తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.ఇక సాయంత్రం ముంబైలో హిందీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ హాజరవుతున్నాడు .
Hype Announcement🔥
Gratefully Welcoming our Megastar @Kchirutweets into the Madness of #Liger to release the Telugu #LigerTrailer 🤩❤️
Tomorrow at 9:30 AM 🕺🏻👉 https://t.co/pdY4YEBt5i@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @PuriConnects @DharmaMovies pic.twitter.com/lck36WgHc1
— Charmme Kaur (@Charmmeofficial) July 20, 2022
Hype Announcement 🔥
Gratefully Welcoming our Rebel Star #Prabhas into the Madness of #Liger to release the Telugu #LigerTrailer 🤩❤️
Tomorrow at 9:30 AM 🕺🏻👉 https://t.co/dyhFe6rxzT@TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @PuriConnects @DharmaMovies pic.twitter.com/QjfXWadYa0
— Puri Connects (@PuriConnects) July 20, 2022