కమర్షియల్స్ వద్దు.. లేడీ ఓరియెంటెడ్స్ ముద్దు
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు కెరీర్ స్పాన్ చాలా తక్కువ. సో తక్కువ టైమ్‌లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలంటే ప్రయోగాలు చెయ్యాలి. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్‌కి భిన్నంగా వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తేనే జనాలు గుర్తుంచుకుంటారు. అందుకే చాలామంది హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి ఓకే చెప్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అనగానే టాప్ హీరోయిన్లు మాత్రమే కనిపిస్తుంటారు. స్టార్ హీరోస్‌తో బోల్డన్ని హిట్స్ కొట్టి, ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌కి షిఫ్ట్ అవుతుంటారు. అయితే ఇప్పటి హీరోయిన్లు మాత్రం కెరీర్ బిగినింగ్‌లోనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కి సైన్ చేస్తున్నారు. సోలోగా కథ నడిపించేసి హిట్ అందుకుంటున్నారు.
ఇక ఉప్పెన చిత్రంతో బంగారు కోడిపెట్టలా దొరికిన బ్యూటీ కృతి శెట్టి. బాక్సాఫీస్ బేబమ్మగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌లో నటిస్తోంది. రామ్ తో ‘ది వారియర్’, నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు చేస్తోంది. లవ్‌స్టోరీస్‌తో బిజీగా ఉన్న కృతి నెక్ట్స్ విరంచి వర్మ దర్శకత్వంలో హీరోయిన్ సెంట్రిక్ మూవీ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఇక రెజీనా ‘శాకిని డాకిని’ సినిమాలో మరో హీరోయిన్‌గా చేస్తోంది. సరైన హిట్స్‌లేక సపోర్టింగ్ రోల్స్‌కి షిఫ్ట్ అయిన రెజీనా ‘శాకిని డాకిని’తో కొత్త టర్న్ తీసుకుంది. వీరితో పాటుముద్దుగుమ్మ నివేదా థామస్ టాప్ హీరోస్‌తో భారీ సినిమాలు చెయ్యకపోయినా, బెస్ట్ పెర్ఫామర్ అనే గుర్తింపు ఉంది. తక్కువ సినిమాలు చేసినా, యాక్టింగ్‌తో జనాలకి దగ్గరైంది. ఇప్పుడీ ఇమేజ్‌ని మరింత పెంచుకోవడానికి లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘శాకిని డాకిని’ చేస్తోంది.వీరితో పాటు తమిళ్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా తనదైన ముద్ర చూపించడానికి ఆద్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ ముద్దుగుమ్మలు సింగిల్ గా వచ్చి ఎలాంటి దుమ్మురేపుతారో చూడాలి.