డీజే టిల్లు పాటకు హీరోయిన్ లయ మాస్ స్టెప్పులు..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నా ఆస్ట్రేలియాలో నివాసముంటున్న ఆమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఇటీవల కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి విశేషం గా ఆకట్టుకున్న లయ, తాజాగా మరో మాస్ బీట్ కి స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. డీజే టిల్లు టైటిల్ సాంగ్ కు లయ, తన స్నేహితురాలితో స్టెప్స్ వేస్తూ కనిపించింది. సినిమాలో హీరో చేసిన స్టెప్స్ ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే లయ తెలుగు సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మరి అందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది.