తమిళ స్టార్ హీరో సిలంబరాసన్ అలియాస్ శింబుకు మద్రాస్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కుమార్ సినిమాను పూర్తి చేయడానికి సహకరించడం లేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో శింబుకు చేదు అనుభవం ఎదురైంది.
Hero Simbu : తమిళ స్టార్ హీరో(Tamil star hero) సిలంబరాసన్ అలియాస్ శింబుకు(Simbu) మద్రాస్ కోర్టులో(Madras High Court) ఎదురు దెబ్బ తగిలింది. కరోనా కుమార్ సినిమాను(Corona kumar Movie) పూర్తి చేయడానికి సహకరించడం లేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో శింబుకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మాత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన మద్రాస్ కోర్టు భారీ జరిమానాను విధించింది. కోర్టు సూచించిన మొత్తాన్ని మూడు వారాల్లోగా కోర్టులో డిపాజిట్(Deposit) చేయాలని సూచించింది. ఈ వివాదం, కోర్టు ఆదేశాల వివరాల్లోకి వెళితే..
కరోనా కుమార్ సినిమాలో నటించేందుకు వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో(Wales Film International Limited) ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఆ సినిమాలో నటించేందుకు రెమ్యునరేషన్‌గా 9.5 కోట్ల రూపాయలు చెల్లించేందుకు నిర్మాత అంగీకరించరు. అడ్వాన్స్‌గా శింబుకు నిర్మాత 4.5 కోట్లు ముట్టజెప్పారు. అయితే అడ్వాన్స్ అందుకొన్న తర్వాత సినిమా పూర్తి చేయడానికి సహకారం అందించకపోగా నిర్మాతను ముప్పు తిప్పలు పెట్టారు అనే ఆరోపణలతో కేసు నమోదైంది. అయితే వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ తరఫున శింబుపై కోర్టులో పిటిషన్ దాఖలు(Filing a Petition in court) చేశారు. శింబుతో జరిగిన ఒప్పంద పత్రంలో కేవలం 1 కోటి రూపాయలు చెల్లించినట్టు స్పష్టమైంది. అయితే 4.5 కోట్లు చెల్లించినట్టు ఎక్కడా లేకపోవడంతో కోర్టు కేవలం 1 కోటి రూపాయలు దాఖలు చేయాలని తన తీర్పులో వెల్లడించింది.
హీరో శింబుపై వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అబ్దుల్ ఖుదోస్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా కుమార్ సినిమా పూర్తి చేయకుండా మరో సినిమాలో నటించకూడదు అని నిర్మాత చేసిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొంది. దాంతో అడ్వాన్సుగా చెల్లించిన 1 కోటి రూపాయలు మూడు వారాల్లోగా కోర్టులో దాఖలు చేయాలని శింబుకు కోర్టు సూచించింది. శింబు రూ.4.5 కోట్లు తీసుకున్నట్లు సరైన ఆధారాలు లేని కారణంగా ఆ మొత్తాన్ని చెల్లించినట్టు రుజువు చేయలేదు. కాబట్టి కోటి రూపాయలు మూడు వారాల్లోగా చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
అయితే మద్రాస్ కోర్టు ఆదేశాల తర్వాత శింబు గానీ, ఆయన పీఆర్ వర్గాలు కానీ పెద్దగా స్పందించలేదు. కోర్టులో కోటి రూపాయలు డిపాజిట్ చేస్తారా..? గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లిస్తారా..? లేదా పై కోర్టుకు అప్పీల్ చేసుకొంటారా..? అనేది ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.