యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush)పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది.
Adipurush : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush)పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో మంచి రెస్పాన్స్ అందుకుంది ఆదిపురుష్. ఇప్పటికే ఒక రిలీజ్.. మూడు వివాదాలు అన్నచందంగా సాగుతోంది ఆదిపురుష్(Adipurush) ప్రయాణం.. తాజాగా మరో వివాదంలో చిక్కుంది. సెన్సార్ బోర్డ్ మెంబరే ఈ మూవీ మేకర్స్ తీరుకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టు మెట్లక్కడం అందర్నీ షాకయ్యేలా చేసింది. బాలీవుడ్లో కూడా ఇది బిగ్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో(Om Raut).. ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. టీజర్ రిలీజ్ నుంచే ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా హిందూత్వ సంఘాలు గొంతులేపేలా చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో అవన్నీ.. కనిపించకుండా.. వినిపించకుండా పోయాయనుకుంటే (Adipurush movie latest trailer).. ఇప్పుడు సెన్సార్ బోర్డ్ లో సనాతన్ ధర్మ ప్రచారకర్త సంజయ్ దీనానాథ్.. ఈసినిమాకు వ్యతిరేకంగా బాంబే హైకోర్టుకెళ్లారు.
ఆదిపురుష్ హిట్ కోసం(Bhadrachalam) బద్రాద్రి (Seetha Ramachandraswamy)రాముడిని(Adipurush movie team visiting) అడ్డం పెట్టుకుంటున్న మూవీ యూనిట్ . ఏకంగా ప్రభాస్(prabhas) చేత పూజలు…విరాళాలు… ఎందుకు ఈ కొత్త ధోరణి? సినిమా మార్కెటింగ్ లోకి దేవుళ్ళను తీసుకుని రావాలా ? శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 10 లక్షల విరాళం అందించారు. ప్రభాస్ తరుపున మూవీ క్రియేషన్ ప్రతినిధులు 10 లక్షల చెక్కును భద్రాచల ఆలయ ఈఓ రమాదేవికి అందించారు. అనంతరం ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించిన ఆదిపురుష్ చిత్రం సూపర్ హిట్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మొత్తాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన శిభిరానికి కేటాయించినట్లు తెలుస్తోంది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆది పురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. గుల్షన్ కుమార్, టీ సీరీస్ సమర్ఫణలో. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం జూన్ 16 న రిలీజ్ కానుంది. ఏది ఏమైనా ఈ మూవీ టీం పై భద్రాచల రాములోరు కరుణ చూపుతారా ..? వేయిట్ చేయాల్సిందే మరి.
రీసెంట్ గా ఈ చిత్ర ట్రైలర్ ను 70 దేశాల్లో విడుదల చేశారు మేకర్స్. దీనికి ఆడియన్స్ నుంచి మంచి స్పందనే వచ్చింది. ఇందులో సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటించిన సంగతి తెలిసిందే. తాజా ట్రైలర్ లో సీత గీత దాటడం, లంకా దహణం, రావణ సంహారం, శబరి ఎపిసోడ్, రామసేతు నిర్మాణం లాంటి కీలకమైన సన్నివేశాలను చూపించారు. అయితే ఈ మూవీ విజయవంతం కావాలని ప్రతినిదులు భద్రాచల ప్రధానాలయంలో మూలవిరాట్‌కు, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయుడికి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.