‘ఆచార్య’ నుంచి తప్పుకున్నా కాజల్ సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా..?
చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటించిన చిత్రం ‘ఆచార్య’. శివకొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఆచార్య చిత్రంలో కాజల్ అగర్వాల్ ను తప్పించిన విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు . కాజల్ పాత్ర సెట్ కాలేదని, అందుకే ఆమెను మధ్యలోనే తొలగించినట్లు డైరెక్టర్ శివ కొరటాల తెలిపినా.. అది అంత కన్విన్సింగ్ గా లేదని అభిమానులు అంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కాజల్ మౌనంగా ఉండడానికి కారణం ఏంటి అనేది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న ప్రశ్న.
ప్రమోషన్స్ లో డైరెక్టర్ అధికారికంగా ప్రకటించినా.. అభిమానులు ఏం అయ్యి ఉంటుంది అని అనుమానం వ్యక్తం చేసినా కాజల్ మాత్రం నోరు విప్పింది లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. నిజానికి ఈ సినిమాలో నటించనప్పటికీ కాజల్ తన పారితోషికాన్ని పూర్తిగా అందుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దాదాపు కోటిన్నర రూపాయలు తీసుకుంది కాబట్టే ఆచార్య నుంచి తప్పించినా సైలెంట్‌గా ఉండిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఈ వార్తలు విని అయినా కాజల్ నోరు విప్పుతుందేమో చూడాలి.