The Warrior : సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే !
The Warrior Movie Completed Censor Formalities: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ‘ది వారియర్’లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ సరసన కృతి శెట్టి మరియు అక్షర గౌడ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ ఈ చిత్రం జూలై 14, 2022 న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సింగిల్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక తాజాగా ‘ది వారియర్’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. అలాగే ఈ సినిమాకి 155 నిమిషాల ప్రదర్శనా సమయాన్ని ఫిక్స్ చేశారు. అంటే దాదాపు 2 గంటల 35 నిమిషాలు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ పోలీసాఫీసర్ గా నటిస్తుండగా.. మరో యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.