Hanuman: మే 12న హనుమాన్ మూవీ రిలీజ్, 11 భాషల్లో ఒకేసారి విడుదల
Hanuman Movie will be released on May 12 in 11 languages
దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న హనుమాన్ సినిమా 11 భాషల్లో విడుదల కానుంది. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్నఈ సినిమా రోజు రోజుకు ఆసక్తిని పెంచుతోంది. చిత్రయూనిట్ అందిస్తున్న అప్‌డేట్లు సినిమాపై విపరీతమైన క్రేజ్‌ను కలిగిస్తున్నాయి. తాజాగా సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
కె. నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న హనుమాన్ సినిమాలో యువ హీరో తేజ సర్జా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ కలిసి గతంలో జార్జిరెడ్డి అనే సినిమా చేసి సక్సెస్ సాధించారు. తాజాగా తెరకెక్కుతున్న హనుమాన్ సినిమా కూడా తప్పనిసరిగా విజయవంతం అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి చెందిన ట్రైలర్ అద్భుతంగా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులలో చర్చ మొదలయింది. హనుమాన్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు చెందిన పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు కొరియన్, జపనీస్, స్పానిష్, చైనీస్ భాషల్లో విడుదల కానుంది. ఇండియాతో పాటు అమెరికా, చైనా, జపాన్, యూకే, స్పెయిన్, ఆస్ట్రేలియా, జర్మనీ, శ్రీలంక, మలేషియా దేశాల ప్రజలు ఈ సమ్మర్‌లో హనుమాన్‌ను చూసి ఎంజాయ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ తరణ్ ఆదర్ష్ హనుమాన్ సినిమాపై ట్వీట్ చేశాడు. సినిమాకు చెందిన పలు విషయాలను వివరించాడు.
‘HANU-MAN’: SUPERHERO FILM RELEASE LOCKED… WILL RELEASE IN 11 LANGUAGES… Team #HanuMan finalises release date: 12 May 2023… Stars #TejaSajja… #PrasanthVarma directs… Produced by #KNiranjanReddy… Will release in 11 languages worldwide… #RKDStudios presents HINDI version. pic.twitter.com/PK61TY41xr
— taran adarsh (@taran_adarsh) January 9, 2023