Hansika Mothwani Introduces her Fiance Soheal Kathuria: గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని పరిచయం చేసింది హన్సిక మోత్వానీ. తెలుగులో దేశముదురు సినిమాతో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ సింధీ భామ తెలుగులో బడా హీరోలతో నటించింది కానీ స్టార్ హీరోయిన్ అవలేక పోయింది. ప్రస్తుతానికి తమిళ సినిమాల ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతున్న ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో కాబోయే భర్త ఎవరనేది రివీల్ చేసింది. ఈఫిల్ టవర్ ముందు తన ఫియాన్సీ లవ్ ప్రపోజ్ చేస్తున్న పిక్స్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ‘ఇప్పుడు… ఎల్లప్పుడూ’ అంటూ తను చేసిన పోస్ట్ కు వరుడు సోహల్ కతురియా కూడా ‘ఐ లవ్ యు మై లైఫ్… ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ’ అని రిప్లై ఇచ్చారు. వ్యాపారవేత్త అయిన సోహైల్ కతురియా హన్సికకు మ్యారేజ్ ప్రపోజ్ చేయగా దానికి ఆమె సర్ప్రైస్ అవుతున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ జంటకు పరిచయం ఉందని, సోహైల్ కంపెనీలో హన్సికకు షేర్లు ఉన్నాయని టాక్ ఉంది. రాజస్థాన్ జైపూర్ ముండోటా ప్యాలెస్‌లో డిసెంబర్ 2న వీరి పెళ్ళి వేడుకలు ప్రారంభం అవుతాయని, డిసెంబర్ 4న వీరి వివాహం కుటుంబ సభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుందని అంటున్నారు.