Gopichand: నేను పుట్టిన గడ్డమీద ఫంక్షన్ చేసుకుంటున్నాం.. ఇంతకన్నా ఏం కావాలి?
Gopichand Speech At Veerasimha Reddy Pre Release Event: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ఒంగోలులో సందడి చేసింది. ఇక ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ బాలయ్య బాబు మనసు బంగారం అని, ఆయన్ని రోజు చూస్తూ ఉండేవాడిని అని అన్నారు. తన కళ్ళలో ఒక కంటితో హీరోగా చూశా.. మరో కంటితో అభిమానిగా చూశానని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చారు. ఇక శృతి హాసన్ తో ఇది మూడో సినిమా అని ఆమె చాలా బాగా నటించిందని పేర్కొన్నారు. ఇక శ్రుతి నాకు లక్కీ హీరోయిన్ అని పేర్కొన్న మలినేని.. హనీ రోజ్ కూడా అద్భుతంగా నటించిందని అన్నారు.
దునియా విజయ్ గారికి బాలయ్య బాబుతో సినిమా చేస్తున్న అందులో నటించాలి అని అడిగా ఆయన మరో మాట కూడా మాట్లాడకుండానే ఓకే చేశారని అన్నారు. ఇక అలాగే ఈ సినిమాలో వరలక్ష్మీ బాలయ్య బాబును ఢీ కొడుతోందని ఆమె నటన హైలైట్ అవుతుందని అన్నారు. ఇక ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్ర గారు అద్భుతంగా డైలాగ్స్ రాశారని, ఈ సినిమా కోసం పనిచేసిన అందరూ నా వెనక నిలబడ్డారని అన్నారు. ఇక నా టీమ్ అంతా బాలయ్య బాబు ఫ్యాన్స్ అని, అలా ఫ్యాన్స్ అందరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే వీర సింహారెడ్డి అని ఆయన అన్నారు. ఇక ఈ క్రమంలో బాలయ్య బాబు మనసు చాలా మంచిది ఆయనకు చేతులెత్తి నమస్కరించాలన్న గోపీచంద్ మలినేని మా బావ థమన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని అన్నారు. ఇక నేను పుట్టిన గడ్డమీద నాకు నచ్చిన హీరోతో.. నా సినిమా ఫంక్షన్ చేసుకుంటున్నాం ఇంతకన్నా జీవితానికి ఏం కావాలి అని అంటూ గోపీచంద్ మలినేని ఎమోషనల్ అయ్యారు.