God Father: ‘గాడ్ ఫాదర్’ ట్విట్టర్ రివ్యూ
God Father Twitter Review: మలయాళ ‘లూసిఫర్’ కి తెలుగు వర్షన్ ‘గాడ్ ఫాదర్’ అందరు ఈచిత్రాన్ని చూసేసారు. మోహన్ లాల్ నటనకు ఫిదా అయ్యారు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో రీమేక్ చేసాడు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఎలా నటించారనే విషయం మీద సర్వత్రా అందరిలో ఆసక్తి నెలకొంది. తెలుగులో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒక సినిమాని మళ్లీ రీమేక్ చేయడం అనేది కత్తి మీద సాము అని చెప్పాలి. అయితే కొద్దిగంటలముందే దర్శకుడు ఈ సినిమాలో మలయాళంలో లేని సర్ప్రైజ్ లు ఇందులో ఉంటాయని తెలిపారు అప్పటినుండి మరింత ఉత్కంఠ నెలకొంది.
ఆచార్య తర్వాత చిరంజీవి నుండి వస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పెడప్పుడు సినిమా విడుదల అవుతుందా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తుండగా, ఆ తరుణం రానే వచ్చింది. ఈరోజు గ్రాండ్‌గా విడుదల అయింది. అయితే ఆచార్య పరాజయాన్ని అందరు మరచిపోవాలంటే చిరంజీవికి ఒక సాలిడ్ హిట్ పడాలి. అది గాడ్ ఫాదర్ తో నెరవేరుతుందని చిరంజీవి గట్టిగా నమ్ముతున్నాడు. అంత నమ్మకం ఉంది కాబట్టే నాలుగు భాషల్లో విడుదల చేసారు . ఇప్పటికే ఓవర్సీస్ లో కొన్నిచోట్ల షోస్ మొదలయ్యాయి. మరి ఈ గాడ్ ఫాదర్ ప్రేక్షకులను ఏ మాత్రం అలరించిందో ట్విట్టర్ రివ్యూ లో చూద్దాం.
నాలుగు దశాబ్దాల తర్వాత కూడా ఆ ఏజ్ లో చిరంజీవి ఇంకా జనాన్ని మెస్మరైజ్ చేస్తున్నారంటే ఆయన ఒక లెజెండ్ అంటూ ఆయన కామెంట్ చేశారు.
Perfect Role for Chiranjeevi. What a screen presence. Even after 4 decades and that age, Chiranjeevi can mesmerize a new cine-goer. An absolute legend. #GodFatherReview #GodFatherOnOct5th
— Telugu Cinema 786 (@TeluguCinema786) October 5, 2022
వెనక్కి తగ్గిన సముద్రం ముందుకొచ్చి సునామీలా ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా అని మరో అభిమాని చిరుని తనదయిన శైలిలో పొగిడాడు.
వెనక్కి తగ్గిన సముద్రం ముందుకొచ్చి సునామీలా ముంచేస్తే ఎలా ఉంటుందో తెలుసా 🌊
Bigger Than BLOCK BUSTER 🔥🔥🔥#GodFather
— Gangadhar AniSettis (@ItsGangadhar) October 5, 2022
ఎంత కాలితే అంత మండుతా.. నిప్పునై, జ్వాలనై రగులుతా.. ఒక్కడినే వచ్చా, ఒంటరిగా పోరాడా. నిలబడ్డ చోటు నుంచి కనబడ్డ కోట వరకూ అన్నీ సొంతం చేసుకున్నా. తెలుగు సినిమా చరిత్రలో ఒక్కడే గాడ్ ఫాదర్ అని అభిమానులు సందడి చేస్తున్నారు.
A big shout to all the fans here.. Its a BLOCK BUSTER…
"ఎంత కాలితే అంత మండుతా.. నిప్పునై, జ్వాలనై రగులుతా.. ఒక్కడినే వచ్చా, ఒంటరిగా పోరాడా. నిలబడ్డ చోటు నుంచి కనబడ్డ కోట వరకూ అన్నీ సొంతం చేసుకున్నా.
తెలుగు సినిమా చరిత్రలో ఒక్కడే గాడ్ ఫాదర్" 🔥🔥🔥#GodFather pic.twitter.com/UqxcKWjbCS— రాయలసీమ జనసేన కుర్రాడు (@MaheshM18869270) October 5, 2022
మరొక నెటిజన్ ద కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఈ సినిమా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరో నెటిజన్ ఈ సినిమాలో చిరంజీవికి పడింది పర్ఫెక్ట్ రోల్ అని ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉందని కామెంట్ చేశారు.
The King is back! #GodFather
— Manish Polisetty (@endhukureturns) October 5, 2022
ఇక మరో నెటిజన్ ఫస్ట్ ఆఫ్ గాడ్ ఫాదర్ ను లూసిఫర్ నుంచి బాగా అడాప్ట్ చేశారని అవన్నీ మెగాస్టార్ ఇమేజ్ కి బాగా సూట్ అయ్యి బాగా వర్క్ అవుట్ అయిందని పేర్కొన్నారు. మెగాస్టార్ ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉందని అలాగే సినిమా స్క్రీన్ మీద నజభజ సాంగ్ కూడా టెర్రిఫిక్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు రేటింగ్స్ ఇచ్చిన వారందరూ 3.5 పైనే ఇస్తున్నారు.
#Godfather A Good Political Action-Thriller that is a faithful remake which sticks true to the core but has changes that keep the proceedings engaging.
Megastar and Thaman show all the way. Fine job of making changes without spoiling the core. Good One👍
Rating: 3/5
— Venky Reviews (@venkyreviews) October 4, 2022
ఈ సమయంలో ఫిలిం క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు గాడ్ ఫాదర్ చిత్రం ప్లాప్ అని తేల్చేశారు. మూవీలో మేటర్ లేదంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి సినిమాలు మానేయడం మంచిదని దారుణమైన కామెంట్స్ చేశాడు. కేవలం 2.5 రేటింగ్ ఇచ్చాడు. యావరేజ్ సినిమా. బి,సి క్లాస్ మాస్ సినిమా వారికి కూడా ఇలాగే అనిపిస్తుంది. చిరంజీవి సినిమాలు మానేసి విశ్రాంతి తీసుకోవడం మంచిది అన్నారు. ఈ కామెంట్స్ పై చిరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
First Review #Godfather from Censor Board ! A Strictly Average flick for B & C Class Masses. An Old wine in a New Bottle ! #Chiranjeevi You need REST Plz 🤦♂️🙏.
⭐⭐1/2
— Umair Sandhu (@UmairSandu) October 3, 2022
ఫస్టాఫ్ చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, ఎక్కడా అనవసరమైన సీన్లు లేవని చెబుతున్నారు. మెగాస్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సన్నివేశాలు చాలా ఉన్నాయట. చిరంజీవి, సత్యదేవ్‌ల మధ్య నడిచే పొలిటికల్ డ్రామా ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగిందట. మాస్ యాక్షన్ సన్నివేశాలకు సంగీత దర్శకుడు థమన్ బీజీఎం మరో లెవల్‌కి తీసుకెళ్లిందట. ఇంటర్వెల్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారు.
మెగాస్టార్ ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉందని అలాగే సినిమా స్క్రీన్ మీద నజభజ సాంగ్ కూడా టెర్రిఫిక్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇంటర్వెల్ పోర్షన్ కూడా డీసెంట్ గానే ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ గా ఎమోషన్స్ కి ఒక పర్ఫెక్ట్ అడ్డాగా ఉందని అంటున్నారు.