Garikapati: నాటు నాటు పాటపై గరిక పాటి కామెంట్స్
Garikapati: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. ఇక గోల్డెన్ గ్లొబ్ అవార్డును సైతం సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ బరిలో నిలవడంతో.. రాజమౌళి యూనిట్ కు ప్రపంచంలో ఉన్న తెలుగువారి నుంచే కాకుండా హాలీవుడ్ చిత్రపరిశ్రమ నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈనెల 12న 95వ ఆస్కార్ అకాడమీ అవార్డులను ప్రకటించనున్నారు. కచ్చితంగా ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్ అవార్డు రావాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
ఇందులో భాగంగా ప్రముఖ ప్రవచనకర్త,పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు ‘నాటు నాటు’ సాంగ్ పై కామెంట్స్ చేశారు. తన ప్రవచనంలో భాగంగా ఇటీవల గరికపాటి నరసింహారావు ‘నాటు నాటు’ పాట గురించి ప్రస్తావించారు. అచ్చ తెలుగులో రాసిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం సంతోషించాల్సిన విషయమని ఆయన అన్నారు. ఈ పాటలో ఒక్క ఆంగ్లపదం లేదన్నారు. ఇప్పటి వరకు ఈ సాంగ్ ను నేను వినలేదు. ఇప్పుడు విన్నాను. ఈ పాటను రిపీట్ చేస్తూ అరగంటపాటు విన్నాను. ఈ సాంగ్ ను రచించిన చంద్రబోస్ చక్కని తెలుగు పదాలతో రాసారని అన్నారు. వయసులో చిన్నవారైనా వాళ్లకు నమస్కారం అంటూ ప్రశంసించారు. రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరి నటుల డాన్స్ ఎలా ఉందంటే.. ఇద్దరూ అలా కూడబలుక్కుని నర్తించడం ఏదైతే ఉందో కవలలుగా పుట్టినవారికి కూడా సాధ్యం కాదని అన్నారు.