ఎట్టకేలకు కాశీలో షూటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టిన బ్రహ్మాస్త్ర
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ హీరోగా నటించగా ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్ర బ్రహ్మస్త్ర . అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, రణబీర్ కపూర్, అలియాభట్, మౌనిరాయ్ తదతరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పై ఇప్పుడు ఫైనల్ అప్డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ పూర్తిచేశారు. పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీలో బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తిచేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.