‘ధమాకా’ లో ఛాన్స్ పట్టేసిన ఇషా రెబ్బ..?
మాస్ మహారాజా రవితేజ హీరోగా నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ధమాకా”. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీ లీల నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో యంగ్ బ్యూటీ నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. తన అందంతో కుర్రకారును మెస్మరైజ్ చేస్తున్న తెలుగు పిల్ల ఇషా రెబ్బ ఈ చిత్రంలో కీల పాత్రలో నటిస్తోందని సమాచారం. అందంతో పాటు నటనకు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో వెంటనే ఇషా కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవలే ఆహా లో 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి హిట్ ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో అక్కడక్కడ మెరిసిన ఇషా భారీ విజయం కోసం ఎదురు చూస్తోంది. ఇక ఈ సినిమా అమ్మడికి టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది అంటున్నారు ఆమె అభిమానులు. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఈ సినిమాతోనైనా తెలుగు అందం ఫేట్ మారుతుందేమో చూడాలి.