Ajay Devgan: 200 కోట్లు వసూలు చేసిన దృశ్యం 2
Drishyam 2 enters Rs 200 Cr club
దృశ్యం 2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నవంబర్ 18న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. మౌత్ పబ్లిసిటీ ద్వారా మంచి టాక్ తెచ్చుకుంది. థియేటర్లకు జనాలను రప్పిస్తోంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గన్‌తో పాటు టబు, శ్రేయాశరన్, రాహుల్ ఖన్నా తదితరులు నటించారు.
ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కూడా దృశ్యం 2 సినిమాకు కలిసి వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా నటించిన యాక్షన్ హీరో సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. వరుణ్ ధావన్, కృతిసనన్ నటించిన భేడియా సినిమా కూడా అంతంత మాత్రంగానే ఉంది.
దృశ్యం సినిమా పార్ట్ 1, పార్ట్ 2 రెండూ కూడా మూడు భాషల్లోనూ విజయం సాధించాయి. మలయాళంలో మోహన్‌లాల్, తెలుగులో విక్టరీ వెంకటేశ్, హిందీలో అజయ్ దేవ్‌గన్‌లు హీరోలుగా నటించారు. ప్రేక్షకులను మెప్పించారు
#Drishyam2 enters ₹ 200 cr Club…#AjayDevgn’s third film to hit DOUBLE CENTURY…
⭐️ 2017: #GolmaalAgain / Diwali / Day 24
⭐️ 2020: #Tanhaji / non-holiday / Day 15
⭐️ 2022: #Drishyam2 / non-holiday / Day 23[Week 4] Fri 2.62 cr, Sat 4.67 cr. Total: ₹ 203.59 cr. #India biz. pic.twitter.com/uLtxy04hX4
— taran adarsh (@taran_adarsh) December 11, 2022