హిట్ కోసం వెయిటింగ్ లో టాలీవుడ్ డైరెక్టర్స్!
తెలుగులో స్టార్ డైరెక్టర్స్ చాలామంది వున్నా సక్సెస్‌లో వుంది మాత్రం చాలా తక్కువ మందే రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల, అనిల్ రావిపూడి సుకుమార్ మాత్రమే ఫామ్‌లో వున్నారు. స్టార్స్‌తోహిట్ ఇచ్చి.. ప్రస్తుతం సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్స్ మాత్రం చాలామందే వున్నారు. వీవీ వినాయక్ హిట్ చూసి చాలాకాలమైంది. ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా.. పదేళ్ల విరామం తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వడంతో సక్సెస్ క్రెడిట్ అంతా మెగాస్టార్‌కు వెళ్లిపోయింది. ఖైదీ నంబర్ 150 తర్వాత సాయిధరమ్‌తేజ్తో తీసిన ఇంటిలిజెంట్ ఫ్లాప్ అయింది. ఇంటిలిజెంట్ ఫ్లాప్ తర్వాత వినాయక్ బాలకృష్ణ మూవీకి కమిట్ అయినా.. కథ సెట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు ఛత్రపతి హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌లో అదృష్టంపరీక్షించుకుంటున్నాడు వినాయక్. అల్లుడు అదుర్స్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేసిన వినాయకే.. ఛత్రపతి రీమేక్‌తో శ్రీనివాస్‌ను బాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.
స్టార్స్‌కు హిట్స్ ఇచ్చి ఓ వెలుగు వెలిగిన దర్శకుడు శ్రీనువైట్ల ప్రస్తుతం డౌన్‌ఫాల్లో వున్నాడు. ఎవరితో ఏ సినిమా తీసినా ఫ్లాపే. హిట్ కోసం ఏడేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. ఆగడు.. బ్రూస్‌లీ… మాస్టర్.. అమర్ అక్బర్ ఆంటోని నిరాశపరిచాయి.ఈ డిజాస్టర్స్ తర్వాత శ్రీనువైట్ల పేరు మళ్లీ వినిపించలేదు. ఎట్టకేలకు ఢీ తర్వాత విష్ణుతో ‘ఢీ అంటే ఢీ’ మూవీతో బిజీ అయ్యారు. ఐదేళ్ల క్రితం స్టార్ డైరెక్టర్స్‌గా దమ్ము చూపించిన కొందరు దర్శకుల పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. చేతిలో వున్న అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకుంటారా? అని టాలీవుడ్ వెయిట్ చేస్తోంది. క్రిష్ అయితే.. ఫ్లాపులతో పాటు.. వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. తన కథల్లో సోషల్ అవేర్‌నెస్ వుండేలా జాగ్రత్తపడే క్రిష్ బాలకృష్ణతో తీసిన కథానాయకుడు, మహానాయకుడు ఫ్లాప్ అయ్యాయి. హిందీలో తీసిన ‘మణికర్ణిక’ క్రెడిట్ దర్శకుడి రాకుండా, సొంతం చేసుకుంది కంగన. వైష్ణవ్‌తేజ్ తీసిన ‘కొండపొలం’ నిరాశ పరిచింది. పవన్ కల్యాణ్‌తో తీస్తున్న ‘హరిహర వీరమల్లు’తో క్రిష్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిపించుకుంటాడేమో చూడాలి. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మరోస్టార్ డైరెక్టర్ సురేంద్రరెడ్డి. రామ్‌చరణ్‌తో తీసిన ధృవ ఫర్వాలేదనిపించింది. సైరా వంటి హిస్టారికల్ మూవీ తీసి దర్శకుడిగా మార్కులు కొట్టేసినా.. కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. రెండేళ్ల విరామం తర్వాత అఖిల్‌తో ‘ఏజెంట్’ మూవీ మొదలుపెట్టాడు సురేందర్‌రెడ్డి.