Ramoji Film City: షూటింగ్‌లో గాయపడ్డ దర్శకుడు రోహిత్ శెట్టి, కామినేని ఆసుపత్రిలో చికిత్స
Director Rohit Shetty injured while Car Chase sequence for a Web Series
బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్ శివారులో జరుగుతున్న షూటింగ్‌లో గాయపడ్డాడు. రోహిత్ శెట్టి చేతికి గాయం తగిలినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. చిన్న సర్జరీ కూడా చేసినట్లు తెలుస్తోంది.
రోహిత్ శెట్టి ప్రస్తుతం ఇండియన్ పోలీస్ ఫోర్స్ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాడు. కారు చేజ్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
రోహిత్ శెట్టి తీస్తున్న పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్‌లో సిద్దార్ధ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక కారు ఛేజింగ్ సీన్‌తో పాటు మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ అనేది రోహిత్ శెట్టి, సిద్ధార్ద్ మల్హోత్రాలకు మొట్ట మొదటి వెబ్ సిరీస్. ఇందులో వివేక్ ఓబ్రాయ్, శిల్పా శెట్టి కూడా నటిస్తున్నారు.