Nithin:టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీ `తొలిప్రేమ` సినిమా నుంచి పవన్‌కు వీరాభిమానిగా వ్యవహరిస్తూ సందర్భాన్ని బట్టి తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు నితిన్.
Nithin:టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ ..పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీ `తొలిప్రేమ` సినిమా నుంచి పవన్‌కు వీరాభిమానిగా వ్యవహరిస్తూ సందర్భాన్ని బట్టి తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు నితిన్. పవన్ కూడా ప్రత్యేకంగా నితిన్ నటించిన సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లకు ముఖ్య అతిథిగా విచ్చేసి నితిన్ సినిమాలకు మరింత క్రేజ్‌ని, పబ్లిసిటీని కల్పిస్తూ వచ్చారు. తాజాగా మరోసారి హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై తనకున్న అభిమానాన్ని మరో సారి చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో మాసీవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `ఎక్సాట్రార్డినరీ మెన్`. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు నితిన్ మరో సినిమా చేస్తున్నారు. దీన్ని `భీష్మ` ఫేమ్ వెంకీ కుడుముల రూపొందిస్తున్నారు. హీరోయిన్ రష్మిక కారణంగా ఆగిన ఈ మూవీ షూటింగ్‌ని కూడా ఇటీవలే మొదలు పెట్టారు.
ఇందులోనూ హీరోయిన్ శ్రీలీలనే నటిస్తోంది. రష్మిక తప్పుకోవడంతో ఆ స్థానంలో శ్రీలీలని ఇటీవలే ఫైనల్ చేసుకుని షూటింగ్ మొదలు పెట్టారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే హీరో నితిన్ మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. `ఎంసీఏ` వకీల్ సాబ్` సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదివారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమాకు పవన్ కల్యాణ్ ఎవర్ గ్రీన్ మూవీ `తమ్ముడు` టైటిల్‌ని ఫైనల్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన `తమ్ముడు` టైటిల్‌తో రానున్న నితిన్ ఈ సారి పవన్ అభిమానుల్ని ఏ స్థాయిలో సంతృప్తి పరుస్తాడో వేచి చూడాల్సిందే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో హీరో నితిన్ ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అలరించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు `దంగల్` ఫేమ్ సత్యజిత్ పాండే సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. నితిన్ సరపసన నటించే హీరోయిన్ ఎవరు? ఇతర నటీనటులు, సాంతకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.