K Viswanath Passed Away Live Updates : కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత
K Viswanath Passed Away Live Updates: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇబ్బంది ఎక్కువ అవ్వడంతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. నేషనల్ అవార్డు సినిమాలను ఎన్నో అందించిన ఆయన సినిమాలలో అందరికి గుర్తుండిపోయేసి శంకరాభరణం సినిమా ఆ సినిమా విడుదలరోజే సినీ ఇండస్ట్రీ కళాతపస్వి ని కోల్పోవడం ఎవరు ఆ బాధను జీర్ణించుకోలేకపోతున్నారు.
కళాతపస్వి ఆఖరియాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు.
ఐదు దశాబ్ధాల పాటు ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసిన దర్శకులువిశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకుని చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. కళాతపస్వి విశ్వనాథ్ ను కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు ఆయన స్వగృహానికి తరలి వస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఆయన నివాసానికి చిరంజీవి,పవన్ కళ్యాణ్, మణిశర్మ, గుణశేఖర్, త్రివిక్రమ్, సాయి కుమార్, బ్రహ్మనందం, రాజశేఖర్, పరుచూరి గోపాలకృష్ణ,మురళీమోహన్,రాఘవేంద్రరావు,డబ్బింగ్ సుజాత, కోదండ రామిరెడ్డివంటి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
పామరుల నుంచి మేధావుల వరకు విశ్వనాధ్ తన సినిమాలతో కదిలించారు. సున్నిత అంశాలను సహజత్వానికి దగ్గరగా బ్లాక్ బస్టర్లుగా మార్చటం ఆషామాషీ కాదు. అటువంటి తెలుగు సినిమాలు ఆయనతోనే సాధ్యం. ఆయన చేతులతో కలిపి అన్నం పెట్టిన సందర్భాలు మరిచిపోలేను. మాది గురు శిష్యుల బంధం. మా ఇద్దరిదీ తండ్రి- కుమారల భావన. ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో విశ్వనాధ్ ను ఆహ్వానించాను. ఆ ప్రేమ వాత్సల్యం మర్చిపోలేను. 43 ఏళ్ల క్రితం శంకరాభరణం విడుదల అయిన రోజునే ఆయన శివైక్యమయ్యారు. విశ్వనాధ్ మరణం వ్యక్తిగతంగా తీరని లోటు.
ఉదయం 11.30 తర్వాత పార్థివదేహానికి శైవిక పద్దతి లో ఇంట్లో పూజలు చేసి..ఆ తర్వాత పంజాగుట్ట శ్మశాన వాటికకు అంతిమయాత్రగా విశ్వనాధ్ గారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లనున్నారు. ఫిల్మ్ నగర్ నివాసం నుండి పంజాగుట్ట స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది.
దర్శకుడు విశ్వనాధ్ నివాసానికి చేరుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. విశ్వనాధ్ కు చిరంజీవి ఘన నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విశ్వనాధ్ దర్శకత్వంలో చిరంజీవి శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు వంటి సినిమాలలో నటించారు.
ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు. అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాము సర్ అని తన సంతాపాన్ని వ్యక్తపరిచాడు.
ప్రపంచంలో ఎవ్వరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే మాకు K. విశ్వనాధ్ గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం.
Your signature on Telugu Cinema &art in general will shine brightly forever.
సినిమా గ్రామర్ లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తo రుణపడి ఉంటాము sir🙏🏻— rajamouli ss (@ssrajamouli) February 3, 2023
తెలుగు సినిమా ఉన్నంతకాలం ప్రజల విశ్వనాధ్ గారు ప్రజల గుండెల్లోబ్రతికే ఉంటాడన్నారు. తెలుగు సినిమా పతాకాన్ని ఖండాంతరాలు ఎగరేసిన భానుభావుడు విశ్వనాథ్.. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు.. ఆయన చాలా సరదా మనిషి.. తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన మనందరిలో జీవించే ఉంటారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. శంకరాభరణం, సాగర సంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను. pic.twitter.com/3Ub8BwZQ88
— Jr NTR (@tarak9999) February 2, 2023
లెజండరీ దర్శకుడి మరణానికి సినీ ప్రపంచం విచారం వ్యక్తం చేస్తుంది. తెలుగు తెరకు ఎన్నో క్లాసికల్ సినిమాలను అందించిన దర్శకుడికి ఘన నివాళ్ళర్పిస్తుంది. తెలుగు సినిమాను అగ్ర శిఖరాన నిలబెట్టిన ఆయనకు తెలుగు సినిమా సెల్యూట్ చేస్తుంది. ఆయన మృతికి సంతాపంగా నేడు స్వచ్చందంగా షూటింగ్ లు బంద్ చేసారు.
విశ్వనాధ్ భౌతిక కాయాన్నిసందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. మంత్రి తలసాని విశ్వనాధ్ ఇంటికి చేరుకొని నివాళి అర్పించారు. నిర్మాతలు అశ్వినీదత్, మురళీ మోహన్, రాఘవేంద్ర రావు , చంద్రబోస్ నటులు రాజశేఖర్ - జీవిత, సాయి కుమార్, కోట శ్రీనివాస రావు నివాళి అర్పించిన వారిలో ఉన్నారు.
సినీ ఇండస్టీ దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు గవర్నర్ తమిళిసై. శంకరాభరణం, స్వాతి ముత్యం, సాగర సంగమం మొదలైన కళాతపస్వి దర్శకత్వం వహించిన క్లాసిక్ సినిమాలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. భారతీయ సినిమా ఓ మేధావిని కోల్పోయిందన్నారు.
Deeply saddened to hear about the passing away of legendary film director Shri K. Vishwanath garu.
Kalatapasvi's directorial classics like Shankarabharanam, Swathi Muthyam, Sagara Sangamam etc., will continue to inspire generations to come
Indiancinema lost a genius Condolences pic.twitter.com/Fv3aNdm8hJ
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 2, 2023
శ్రీ కె. విశ్వనాథ్ గారు మృతి చెందడం బాధాకరం.ఆయన ఒక సృజనాత్మక మరియు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న సినీ ప్రపంచంలోని గొప్ప ప్రముఖుడు. అతని సినిమాలు దశాబ్దాలుగా వివిధ శైలులను మరియు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించాయి, అక్కట్టుకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ఓం శాంతి అంటూ ప్రధాని నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేసారు.
Saddened by the passing away of Shri K. Viswanath Garu. He was a stalwart of the cinema world, distinguishing himself as a creative and multifaceted director. His films covered various genres and enthralled audiences for decades. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) February 3, 2023
విశ్వనాథ్ గారికి కమల్ హాసన్ ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పట్ల నిత్యం గురు భక్తి ప్రదర్శించే కమల్ హాసన్.. కళాతపస్వి గురించి కాగితంపై స్వయంగా రాసిన మాటలను పోస్ట్ చేశారు. జీవిత పరమార్థం, కళలకు ఉండే అమరత్వం గురించి కె విశ్వనాథ్ గారు బాగా అర్థం చేసుకున్నారు. కళాతపస్వి సృష్టించిన కళ.. ఆయన జీవితకాలానికి మించి మరణానంతరం కూడా వేడుకలా సాగుతుంది. కళలకు చావు లేదని విశ్వనాథ్ గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయనకు సంతాపాన్ని తెలిపారు.
Salute to a master . pic.twitter.com/zs0ElDYVUM
— Kamal Haasan (@ikamalhaasan) February 3, 2023
దర్శకులు కె.విశ్వనాథ్ గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.
సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/yDfReAYhA8
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023
సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ గారు, దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి ఆదర్శంగా నిలిచాయి. pic.twitter.com/3mQ8yuYx52
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 3, 2023
ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించిందన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ సినీ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ గారి మృతి తీవ్రంగా కలచివేసింది. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను. pic.twitter.com/1hMIAFfUSp
— N Chandrababu Naidu (@ncbn) February 3, 2023
విశ్వనాధ్ భౌతిక కాయాన్ని సందర్శించి హీరో వెంకటేష్ నివాళి అర్పించారు. ఆయన దర్శకత్వంలో తాను స్వర్ణకమలంలో పని చేసిన ఆ రోజులను అనుభవాలను పంచుకున్నారు. ఆయన విలక్షణ దర్శకుడిగా పేర్కొన్నారు. విశ్వనాధ్ సినిమాలు తెలుగు సినీ ప్రపంచంలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని కీర్తించారు.
సినీప్రపంచానికి ఇది తీరనిలోటన్నారు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్. ఆయననుండి ఎన్నో నేర్చుకున్నానని గుర్తుచేసుకున్నారు. గురూజీ మరణం ఎంతగానో బాధించిందంటూ సంతాపం వ్యక్తం చేసాడు.
K. Vishwanath Ji you taught me so much, being on set with you during Eeshwar was like being in a temple…
RIP My Guru 🙏 pic.twitter.com/vmqfhbZORx— Anil Kapoor (@AnilKapoor) February 2, 2023
విశ్వనాధ్ భౌతిక కాయాన్ని సందర్శించి పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. దర్శకుడు తివిక్రమ్ తో కలిసి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్.. విశ్వనాద్ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు. పాశ్చాత్య సంగీతాలు.. పోకడలు కొనసాగుతున్న వేళ తెలుగు సినిమాలో విశ్వనాద్ విలక్షణ దర్శకత్వంతో చరిత్రలో నిలిచే సినిమాలు అందిచారని కొనియాడారు. విశ్వనాధ్ తీసిన శంకరాభరణం సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. తెలుగు సినీ పరశ్రమ ఉన్నంత కాలం విశ్వనాధ్ ను ఎవరూ మరిచిపోలేరని తెలుగు సినిమాకి అయన ఎవరెస్టు శిఖరం అన్నారు.
కళాతపస్వి కె విశ్వనాథ్ తెలుగుజాతి ముద్దుబిడ్డ గా నందమూరి బాలకృష్ణ కొనియాడారు. విశ్వనాథ్ మరణంపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ గారి ప్రతి సినిమా ఒక అద్భుత కళాఖండం..అందుకే ఆయన కళాతపస్వి..మన సంస్కృతి, సంగీత, సాహిత్యాల ఔన్నత్యాన్ని దశదిశలా చాటిచెప్పారు. ఆయన సినిమాలు సందేశాత్మకమే కాకుండా, అద్భుత సాంకేతిక విలువలతో మన కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని శిఖరాగ్రాన నిలబెట్టాయి, ప్రజాదరణ పొందాయి. కె విశ్వనాథ్ మృతితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దదిక్కును కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. విశ్వనాథ్ గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సంతాపం వ్యక్తం చేసారు.
భారతీయ సాంసృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను తీసిన కళాతపస్వి విశ్వనాథ్ గారి మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. దర్శకుడు కె విశ్వనాథ్ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు . సామాజిక అంశాలను జోడించి తీసిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచే ఉంటాయని వారి సేవల్ని కొనియాడారు. వారి కుటుంబానికి అభిమానులకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి డాక్టర్ కాశీనాథుని విశ్వనాథ్ గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను.
తన ప్రతి చిత్రంలోనూ భారత సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, భాషను కాపాడుకునేందుకు వారిచ్చే సందేశం మనందరికీ స్ఫూర్తిదాయకం. pic.twitter.com/D9l0AzPiqD
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2023
సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం, సినిమా మాధ్యమం ద్వారా సానుకూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు వారు చేసిన కృషి చిరస్మరణీయం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2023
నాలుగు దశాబ్దాలకు పైగా దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీలో ప్రస్థానం కొనసాగించిన ఆయన 92 ఏళ్ల వయసులో రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులను సినీ పెద్దలు ఓదారుస్తున్నారు. విశ్వనాధ్ భౌతిక కాయాన్ని ఫిల్మ్ నగర్ లోని ఇంటికి తరలించారు కుటుంబ సభ్యులు..ఒక్కొకరుగా విశ్వనాధ్ భౌతిక ఖాయానికి నివాళ్లర్పించాడానికి ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.
కళాతపస్వి మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్రకటించారు. ఆయన మరణంతో షాక్ అయినట్లు చెప్పారు. సినీ రంగానికి..వ్యక్తిగతంగా తనకు తీరని నష్టమన్నారు. విశ్వనాధ్ ఒక లెజెండ్ గా చిరంజీవి నివాళి అర్పించారు. విశ్వనాధ్ ప్రతీ జన్మదినం నాడు ప్రత్యేకంగా చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి గౌరవిస్తారు. ఇప్పుడు విశ్వనాధ్ మరణంతో తనకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ చిరంజీవి ట్వీట్ చేసారు. విశ్వనాధ్ సినిమాలకు ఒక ప్రత్యేకత ప్రత్యేకత ఉంటుందన్నారు.
Shocked beyond words!
Shri K Viswanath ‘s loss is an irreplaceable void to Indian / Telugu Cinema and to me personally! Man of numerous iconic, timeless films! The Legend Will Live on! Om Shanti !! 🙏🙏 pic.twitter.com/3JzLrCCs6z— Chiranjeevi Konidela (@KChiruTweets) February 3, 2023
కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మరణం సినీ పరిశ్రమకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు తీరని లోటని వ్యాఖ్యానించారు. వెండితెరపై దృశ్య కావ్యాలను ఆవిష్కరించిన అరుదైన దర్శకుడని కొనియాడారు. విశ్వనాథ్‌కు ఆరోగ్యం బాగలేదని తెలిసి గతంలో వెళ్లి పరామర్శించానన్న కేసీఆర్.. సమయంలో సినిమాలు, సంగీతం, సాహిత్యంపై జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు.
విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసిందని ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తెలిపారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోయారన్నారు.
ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి, పద్మశ్రీ కె. విశ్వనాథ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథనైనా తమ అద్భుత ప్రతిభతో వెండి తెర దృశ్య కావ్యంగా మలిచే అరుదైన దర్శకులు శ్రీ కె. విశ్వనాథ్ అని సీఎం అన్నారు. pic.twitter.com/5nZmJpsDIV
— Telangana CMO (@TelanganaCMO) February 3, 2023
విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.#KVishwanath pic.twitter.com/XKAq2E68yn
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 2, 2023
కె విశ్వనాధ్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు తెనికేళ్ల భరణి, రాఘవేంద్ర రావు సినీ పెద్దలు ఆయన స్వగృహానికి తరలి వస్తున్నారు. అయన మరణాన్ని ఎవరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.
శంకరాభరణం.. సాగర సంగమం.. స్వాతిముత్యం.. సిరివెన్నెల.. ఎన్నో ఆణిముత్యాలను వెండితెరకు అందించిన కళాతపస్వి. సినీ ఇండస్టీలో ఎందరో అగ్రహీరోలు సక్సెస్ లు అందించిన ఘనత ఈయనకే చెల్లుతుంది. పాశ్చాత్య పోకడతో కొట్టుమిట్టాడుతున్న సినిమా లోకానికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అద్దిన దర్శక యశస్వి విశ్వనాధ్