K.Ragavendrarao: తెలుగు మీద సినిమా తీస్తే అది విడుదల కాలేదు..రాఘవేంద్ర రావు
K.Ragavendrarao: తెలుగు చిత్రాలను కమర్షియల్ బాట పట్టించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో వందకు పైగా చిత్రాలను రూపొందించిన ఈయన అత్యధిక సక్సస్ రేటు ని సాధించుకున్నారు. టాలీవుడ్ లో వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న సమయంలో దర్శకేంద్రుడు బాలీవుడ్ లో సినిమాలను తెరకెక్కించారు. అక్కడ కూడా సక్సెస్ సాధించారు. ఇన్ని సక్సెస్ లను ఇండస్ట్రీకి అందించిన దర్శకేంద్రుడి సినిమా ఒకటి విడుదలకు నోచుకోలేదని అన్నారు. తెలుగు సంగమం కార్యక్రమంలో రాఘవేంద్రరావు ఈ వ్యాఖ్యలు చేసారు.
తాజాగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ..నాకు తెలుగు అంటే ఎంతో మక్కువ చాల సినిమాలు తెలుగులోనే తెరకెక్కించాను. అగ్ర హీరోలను ఇండస్టీకి పరిచయం చేశాను. మేజర్ చంద్రకాంత్ సినిమాను తెరకెక్కిస్తుంటే నాకు ఓ ఆలోచన వచ్చింది. తెలుగుకు ప్రాధాన్యమిస్తూ ఓ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాను. ఇదే విషయం అన్నగారు ఎన్టీఆర్ కి ఓ మాట చెప్పానన్నారు. తెలుగు భాషని అన్ని స్కూల్స్ లో తప్పనిసరి నేర్పించాలని ఎన్టీఆర్ ని కోరాను అని తెలిపాడు. ఎందుకంటే తెలుగు భాషపై పట్టున మహానుభావుడాయన అందుకు సరేనన్నాడు.
ఇక తెలుగుపై నేను ఓ సినిమాను మొదలుపెట్టానన్నాడు. నేను తీసిన ఓ సినిమాలో హీరో తెలుగుని ఉద్యమంగా తీసుకుంటాడు.. హీరో స్కూల్ లో తెలుగు గురించి టీచర్స్ ని అడుగుతాడు.. ఆ సీన్ ప్రత్యేకంగా ఉంటుంది..తల్లి ఒడిలో ఉన్నపిల్లాడు అమ్మ అంటాడు..కానీ బడికెళ్ళాక అదే తల్లిని మమ్మి అంటాడు..ఈ సీన్ అందులో ప్రత్యేకం అని అన్నాడు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదన్నారు. ఇంతకీ ఆసినిమాగురించి ఎక్కువగా ప్రస్తావించలేదు . ఇక తెలుగు సినిమాను దేశ ఎల్లలు దాటినా రాజమౌళిని ప్రత్యేకంగా అభినందించారు. రాజమౌళి, కీరవాణి ఇండియన్ స్టార్స్ గా ఎదిగారు. వీరి పిల్లలను నేను చిన్నప్పటినుండి చూస్తున్నా.. స్కూల్ కాలేజీలో ఇంగ్లీష్ మాట్లాడిన.. ఇంట్లోమాత్రం తెలుగులో మాట్లాడుతారు..ఏ రాష్ట్రంలో ఆ వ్యక్తులు వారి మాతృ భాష మాట్లాడించేలాగ చేయాలనీ కోరుకుంటున్నానని తెలిపారు. మాతృ భాష అంశంపై ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి త్వరలోనే నేను ఓ షార్ట్ ఫిలిం తీస్తాను..అది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో రిలీజ్ చేయిస్తానన్నారు.