Director Bobby: చిరంజీవి కి రాజకీయాలు సెట్ కావు ..డైరెక్టర్ బాబీ
Director Bobby: డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా స్టార్ నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా వైజాగ్ లో నిర్వహించిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ.. ఈవెంట్ లో చిరంజీవి, రవితేజ, నిర్మాతలు, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాబీ మాట్లాడుతూ .. మెగాస్టార్ చిరంజీవికి రాజకీయాలు ఒక్క శాతం కూడా సరిపడవని అన్నారు. అదేసమయంలో చిరంజీవిలోని మంచితనం ఆవేశం కలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఆయన రాజకీయాలలో ఎదురుదాడి చేయరు. ఆయన్ని ఎవరేమన్నా మౌనంగా ఉంటాడే తప్ప ఒక్కమాట కూడా నోరుజారారు. ఎదురుదాడి ఎందుకు చేయరని అన్నయ్య చిరంజీవిని అడిగాను.. వాళ్లకి అమ్మనాన్నలు, అక్కా చెల్లెళ్లు ఉంటారు. వారు బాధపడుతారు అని అన్నారు. ఆయన మంచితనం ఎలాంటిదో అపుడు నాకు అర్థమైంది.
చిరంజీవిగారి అభిమానిగా ‘ఇంద్ర’ సినిమా చూసిన తరువాత నా లక్ష్యం ఏమిటనేది అర్థమైంది అని అన్నారు. చిరంజీవిగారికి మా నాన్నగారు కరడుగట్టిన ఫ్యాన్. ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్లకి చిరంజీవిగారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గూగుల్ లో నాకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. ఇకపోతే నేను ఈ రోజున ఆ స్థాయికి చేరడానికి కారణం రవితేజనే. పవర్ సినిమాతో ఆయన నాకు అవకాశం ఇవ్వడం వల్లనే ఇక్కడకి వరకు వచ్చాను అని చెప్పుకొచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదలవుతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.