Devisri Prasad: క్లాస్ బీట్ నుండి మాస్ బీట్ వేయించిన హీరోలు వీళ్ళే..దేవిశ్రీ
Devisri Prasad: చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాపై ఇప్పటికే ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు అటు మాస్ రాజా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. 2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ కాబోతుంది. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వైజాగ్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొంది.
ఆ సందర్బంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ మాట్లాడుతూ..చిరంజీవి సినిమాలను చూసి బాబీ డైరెక్టర్ అయ్యాడు .. ఆయన మాస్ ఇమేజ్ చూసి రవితేజ హీరో అయ్యాడు .. చిరూ డాన్సులు చూసి నేను మ్యూజిక్ డైరెక్టర్ ను అయ్యాను. అని చెప్పుకొచ్చారు. క్లాస్ మ్యూజిక్ వాయిస్తున్న నన్ను మాస్ బీట్ వేయించేలా చేసింది రవితేజ అని అన్నారు..ఈ మాస్ బీట్ ను చిరంజీవి ఎంకరేజ్ చేసి తన సినిమాలలో తప్పనిసరిగా మాస్ బీట్ ఉండేలా చూసుకుంటున్నారని అన్నారు.
శంకర్ దాదా నుండి వాల్తేరు వీరయ్య వరకు ఎన్నో మాస్ బీట్స్ వాయించానని చెప్పుకొచ్చాడు ,క్లాస్ మ్యూజిక్ వాయిస్తున్న నన్ను మాస్ బీట్స్ వేయించేలా చేసింది ఈ ఇద్దరు హీరోలెనని అన్నారు. ఈ సినిమాలో నా బాణీలను తన మాస్ స్టెప్పులతో శేఖర్ మాస్టర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లాడని అన్నారు.