DeepikaPadukone: ఆస్కార్ వేడుకల్లో దీపికాపదుకొనే
Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే అరుదైన గౌరవాన్ని దక్కించుకోనున్నది. ‘పటాన్’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమెకు.. ఆస్కార్ ఈవెంట్‌నుండి ఆహ్వానం లభించింది. మార్చి 12న జరుగనున్న ఆస్కార్ వేడుకలో అవార్డ్స్ ప్రజెంటర్‌గా దీపికా పదుకొనె వ్యవహరించబోతుంది. ఈసారి అవార్డుల ప్రజెంటర్‌గా ఆమె ఈ వేడుకకు హాజరు కాబోతోంది. విజేతలకు ఆస్కార్ అవార్డుని అందించబోయే పదహారు మంది సెలబ్రిటీస్‌లో దీపికా పేరును అకాడెమీ సంస్థ తాజాగా ప్రకటించింది.
ఈనెల 12న డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డుల వేడుక జరగబోతోంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది దీపికా పదుకొనే. ఆస్కార్ ప్రకటించిన లిస్ట్ ని పోస్ట్ చేస్తూ హ్యాపీనెస్‌ని షేర్ చేసుకుంది. ఇందులో జెన్నిఫర్ కన్నెలే, శామ్యూల్ ఎల్ జాన్సన్, డ్వేన్ జాన్సన్, జోయ్ సాల్డనా, మైఖేల్ బి జోర్దాన్, ఎమిలి బ్లంట్, జోనాథన్ మేజర్స్ వంటి 16 మంది సెలబ్రిటీల జాబితాలో దీపికా పేరు ఉండటం విశేషం. ఇక ఇండియన్ తెలుగు సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ రేసులో పోటీపడుతున్న విషయం తెలిసిందే. సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డ్స్ వేదికపై లైవ్‌లో ఈ పాట పాడబోతున్నారు. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ లాస్ ఏంజెల్స్ కు చేరుకుంది.