Dasara Movie: మార్చి 14న దసరా ట్రైలర్, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన హీరో నాని
Dasara Movie trailer will be released on March 14
నేచురల్ స్టార్ నానీ నటించిన దసరా సినిమా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ నెల 30వ తేదీని సినిమా విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పుడుతున్నప్పటికీ ఇప్పటి వరకు ట్రైలర్ విడుదల కాలేదు. ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూపులకు చిత్ర యూనిట్ తెరదించింది. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామనే విషయాన్ని వెల్లడించింది.
మార్చి 14న దసరా ట్రైలర్
నాని నటించిన దసరా సినిమా ట్రైలర్ మార్చి 14న విడుదల కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ వెల్లడించింది. హీరో నాని ట్విట్టర్ ద్వారా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా అదరహో అనిపించేలా ఉంది. తగలబడుతున్న రావణాసురిడి బొమ్మ ముందు హీరో నాని నిలబడి ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా చిత్రం మార్చి 30న విడుదల కానుంది. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పీరియడ్ డ్రామాకు సంతోష్ నారాయణ సంగీతం అందించాడు.
కొన్ని రోజుల క్రితం విడుదల అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. నాని మాస్ గెటప్ అదరహో అనిపించేలా ఉంది. సిల్క్ స్మిత పోస్టర్లు కూడా సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.