Dasara: దసరాకు యు/ఎ సర్టిఫికెట్
Dasara: శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని నటిస్తున్న పాన్ ఇండియా మాస్ మసాలా దసరా. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని కూడా పూర్తి చేసుకుంది. దసరాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమా రన్ టైమ్ 2:36 గంటలుగా ఫిక్స్ చేసారు. ఇలాంటి జానర్ సినిమాలకు ఇది పర్ఫెక్ట్ రన్‌టైమ్ అనే చెప్పాలి.
రన్ టైమ్ సినిమాకు కలిసొచ్చేలానే ఉంది అనే చెప్పాలి. ఇప్పడున్న సినిమాల సమయంలో ఎంత కంటెంట్ ఉన్న సినిమా అయినా ఎక్కువ నిడివి ఉంటే ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారు. సినిమా మొత్తంలో రెండు, మూడు సీన్‌లు బోర్ కొట్టిచ్చినా సరే.. ఆ ఎఫెక్ట్ సినిమాపై పడే అవకాశం ఉంది. కానీ మొదటి నుండి ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో ఓ లెవల్లో ఉన్నాయ్. ఇందులో పల్లెటూరి స్నేహితుల మధ్య అందమైన బాండింగ్, రస్టిక్ లవ్ స్టొరీ, మునుపెన్నడూ లేని విధంగా యాక్షన్, అందరినీ కదిలించే భావోద్వేగాలు ఇందులో ఉండనున్నాయి. డి-గ్లామరస్‌గా కనిపించే ఛాలెంజింగ్ పాత్రను పోషించారు నాని. ఎస్‌ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్ తో ‘దసరా’ ని అద్భుతంగా నిర్మించారు. మార్చి 30న ప్రేక్షకులముందుకురానుంది.