Danush: సార్.. కలెక్షన్స్ ఎంతో తెలుసా
Danush: టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ తాజా సినిమా ‘సార్’ ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ అరంగేట్రం చేసింది. ఈ సోషియో డ్రామాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త కథానాయికగా నటించారు. విడుదలైన మొదటిరోజునుండే ఈ చిత్రం బారి వసూళ్లతో దూసుకెళుతుంది. మొట్టమొదటి సారి డాన్స్ కెరీర్లో అత్యంత భారీ వసూళ్లను కొల్లగొట్టిన సినిమాగా ఈ సార్ నిలిచింది.
ఇక సార్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా 100 కోట్ల క్లబ్’లో చేరింది. దీంతో ధనుష్ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 118 కోట్లకు పైగా గ్రాస్ ను అధిగమించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాతో ధనుష్ మార్కెట్ మరింత హైప్ అయిందనే చెప్పాలి. తొలిరోజే రూ.16. కోట్లకు పైగా వసూలుచేసి చిత్రంగా ధనుష్ కెరీర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, నర్రా శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.