Daggubati Family Land Controversy : భూ వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీ
Daggubati Family Land Controversy : దగ్గుబాటి ఫ్యామిలీ భూ వివాదంలో చిక్కుకుంది. సదరన్ స్పైసిస్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ నంద కుమార్ దగ్గుబాటి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు కేటాయించిన భూమిని లాక్కోవాలని చూడడమే కాకుండా బెదిరిస్తున్నారు అంటూ ఆరోపించారు. ఇక ఈ వివాదంలో టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, రానా, సురేష్ బాబు పేర్లు కూడా వినిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో బాధితుడు పిటిషన్ దాఖలు చేశాడు. తనకు అమ్మిన భూమిని కొడుకు రానాకు రిజిస్ట్రేషన్ చేశాడని, తనతో పాటు మరొక్కరిని కూడా అగ్రిమెంట్ పేరుతో మోసం చేసారని, కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా రిజిస్ట్రేషన్ చేశాడని బాధితుడు ఆరోపించాడు.
హీరో వెంకటేష్ సైతం తన పేరు మీద1200 గజాల భూమి తనకు లీజ్ అగ్రిమెంట్ ఉందన్న బాధితుడు బలవంతంగా తనను ఖాళీ చేయించేందుకు దగ్గుబాటి కుటుంబం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే తనకున్న పరపతిని ఉపయోగించి పలు రకాలుగా వేధిస్తున్నారని నంద కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో గతంలో బెదిరింపులకు దిగారని, ఈ బెదిరింపుల వల్ల తన కుటుంబం ఏం జరుగుతుందనే భయాందోళనలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నాకు ఏం జరిగినా సురేష్ బాబుదే బాధ్యత అని, న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తానని నంద కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈరోజు రానా కోర్టు కు హాజరు కాకపోవడంతో తదుపరి విచారణ ఆగస్టు 2 కు వాయిదా వేసిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.