Ahimsa: ఏప్రిల్ 7న దగ్గుబాటి అభిరామ్ ‘అహింస’
Ahimsa: వెండితెరపై వైవిధ్యమైన ప్రేమకథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అహింస’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుందని అప్ డేట్ ఇచ్చారు. చాల రోజుల తర్వాత ఆర్పీ పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వీరి కంబిన్సేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి కమర్షియల్ హిట్ గా నిలిచాయి. 20 ఏండ్ల క్రితం తేజ డైరెక్షన్‌లో లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన జయం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సదా.. ఈ చిత్రంలో లాయర్‌గా కనిపించనుండటం విశేషం. ఈ మూవీలో గీతికా హీరోయిన్‌గా నటిస్తుంది. రజత్ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవీ ప్రసాద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.