Balagam: ఫుల్ ప్రాఫిట్స్ తో రన్ అవుతున్న ‘బలగం’
Balagam: కమెడియన్ వేణు దర్శకత్వంలో దర్శి, కావ్య జంటగా తెరకెక్కిన మూవీ ‘బలగం’ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న ‘బలగం’ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయిందనే చెప్పాలి. ఈ సినిమా మూడో వారంలో అడుగు పెట్టగా సినిమా 15వ రోజున రెండు కొత్త సినిమాలతో పోటి పడటం వలన థియేటర్స్ ని కొన్ని కోల్పోగా ఆ సినిమాల ఇంపాక్ట్ వలన కొంతమేర తగ్గినా.. మళ్ళీ పుంజుకుంది. ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతుంది ఈ సినిమా.
బలగం సినిమా కేవలం 1.30 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 2 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. సినిమా బాగుంది అని టాక్ రావడంతో మరో రెండు కోట్లు వసూళ్లు చేస్తుందనుకుంటే మేకర్స్ కె దిమ్మతిరిగే బిజినెస్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఈ సినిమా రెండు వారాలకు గాను నైజాంలో 9 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఏపీలో మొత్తం 5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తంగా బలగం సినిమా రెండు రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి దాదాపు 15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల వారు చెపుతున్నారు. అంటే దాదాపు 8 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ తో బలగం సినిమా రన్ అవుతుంది.