Colour Photo: జాతీయ అవార్డు అందుకున్న కలర్ ఫోటో
Colour Photo Movie Wins National Award: కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలు మరోసారి సత్తా చాటాయి. ముఖ్యంగా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న కలర్ ఫోటో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకోవడం విశేషం. ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా 2020లో వచ్చిన ఈ సినిమాలో సుహాస్, చాందినీ చౌదరి జంటగా నటించారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నీలం రాజేష్, బెన్నీ ముప్పనేని నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కమెడియన్ సునీల్ విలన్ గా నటించి మెప్పించాడు.
ఇక జాతీయ అవార్డు దక్కడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. కలర్ ఫోటోకు జాతీయ స్థాయిలో అవార్డులభించడం చాలా సంతోషంగా ఉందని, సినిమాకు అవార్డు వస్తుందని ఊహించలేదని హీరో సుహాస్ చెప్పుకొచ్చాడు. హీరోగా చేసిన మొదటి సినిమాకే అవార్డు దక్కడం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు సినిమాకే దక్కుతుందని, ఎప్పుడైనా సినిమానే గెలుస్తుందని తెలిపాడు. ఇక పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.