Vijay-Ajith Fans: ఎనిమిదేళ్ల తర్వాత పోటాపోటీగా సూపర్‌స్టార్స్ సినిమాలు..ముదురుతున్న ఫ్యాన్స్ గొడవలు
Vijay-Ajith Fans: స్టార్ హీరోల అభిమానుల మధ్య సినిమాల రిలీజ్ టైంలో జరిగే వివాదాల గురించి చెప్పనక్కర్లేదు. అభిమానం అంటే హద్దులుదాటకూడదు. ఎవరి సినిమా విడుదలైన సినిమాను సినిమాలాగానే చూడాలి. కానీ హద్దులుదాటితే పరిణామాలు వేరేలాఉంటాయి. ఇలాంటి సంఘటనే తమిళనాడులోని కోయంబేడులోని ఓథియేటర్ వద్ద జరిగింది. కోలీవుడ్ సూపర్‌స్టార్స్ అజిత్, విజయ్ ఇరు అభిమానుల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో పోలీసులు ఇరువురి అభిమానులపై లాఠీని ఝళిపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… హీరో అజిత్ నటించిన తునివు, విజయ్ నటించిన వారిసు చిత్రం డిసెంబర్ 11న విడుదల అయ్యాయి. ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరి సూపర్‌స్టార్స్ సినిమాలు ఒకేరోజు విడుదల అవడంతో ఇరు హీరోల అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.
సినిమా విడుదలై నాలుగు రోజులైనా ఈ వివాదం ముదురుతోంది. అజిత్ సినిమాకు ఆడియన్స్ నుంచి అనుకున్నంత రెస్పాన్స్ రాకపోయేసరికి విజయ్ ఫాన్స్ సంబరాలు చేస్తున్నారు. అదేవిదంగా విజయ్ ‘వారిసు’ నడుస్తున్న థియేటర్లవద్ద అభిమానులు హారతులు పడుతున్నారు. తమిళనాడులోని కోయంబేడులోని థియేటర్ల వెలుపల అర్థరాత్రి అజిత్, అభిమానులు గొడవకు దిగారు. ఈ గొడవల్లో అజిత్ అభిమానులు విజయ్ నటించిన వారిసు చిత్ర పోస్టర్‌ను.. విజయ్ అభిమానులు ‘తునివు’ చిత్ర పోస్టర్లను చించివేశారు. దీంతో అభిమానుల మధ్య ఏర్పడిన గొడవ పెరుగుతుండటంతో.. సమాచారం తెలుసుకున్న పోలీసులు థియేటర్ వద్దకి చేరుకుని గుమికూడిన అభిమానులపై లాఠీఛార్జీ చేసారు.
గతంలో కూడా ఈ వివాదం రాజుకుంది. విజయ్ హీరోగా చేసిన ‘మెర్సల్’ చిత్రం టీవీలో ప్రసారం అయ్యింది. దీనికి 8.5 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయితే అజిత్ హీరోగా చేసిన ‘వీరమ్’ సినిమా తొలిసారి టీవీ ఛానల్లో ప్రసారమైనప్పుడు 18 టీఆర్పీ రేటింగ్ రాగా, రెండవసారి ప్రసారమైనప్పుడు టీఆర్పీ రేటింగ్ 9 వచ్చింది. అయితే దాంతో విజయ్ కంటే అజిత్ గొప్ప అంటూ ఆయన ఫ్యాన్స్ వాదించారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.