Allu Arjun:మెగా మేనల్లుడు, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే. గురువారం కేంద్రం 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డుల్లో `పుష్ప` సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే.
Allu Arjun:మెగా మేనల్లుడు, టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే. గురువారం కేంద్రం 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్ని ప్రకటించింది. ఈ అవార్డుల్లో `పుష్ప` సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని సందర్భం ఇది. ఇంత వరకు ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీఆర్, చిత్తూరు నాగయ్య వంటి హేమా హేమీలతో పాటు చిరంజీవి నుంచి నేటి హీరోల వరకు ఇంత వరకు దక్కించుకోని అవార్డుని బన్నీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించారు.
తెలుగు నటుడికి జాతీయ పురస్కారం లభించడం ఇక అసాధ్యం అన్న మాటలని మార్చి తెలుగు నటుడికి సాధ్యమేని నిరూపించారు. దీంతో అల్లు అర్జున్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖులు, పెద్దలు బన్నీని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సతీమణి, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సోదరి శ్రీమతి సురేఖ మేనల్లుడు అల్లు అర్జున్ను ప్రత్యేకంగా అభినందించారు. బన్నీ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు.
గురువారం కేంద్రం 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాలని ప్రకటించింది. అదే రోజు చిరు సతీమణి సురేఖ బన్నీ నివాసానికి వెళ్లి ఆయనని అభినందించారు. ప్రేమగా దగ్గరకు తీసుకుని మెచ్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా బయటికి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే బన్నీ ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో `పుష్ప 2`ని నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా రూ.360 కోట్లు రాబట్టింది. సెకండ్ పార్ట్ కచ్చితంగా అంతకు రెట్టింపు రాబట్టాలనే ఆలోచనతో ఫస్ట్ పార్ట్ సాధించిన రూ.350 కోట్ల బడ్జెట్‌తో `పుష్ప2`ని నిర్మిస్తున్నారు. బిజినెస్ పరంగా ఇప్పటికే సంచనంగా మారిన `పుష్ప 2` ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Vadinamma #Surekha Garu Congratulated Bunny @alluarjun ♥️@KChiruTweets || #MegaStarChiranjeevi
#NationalFilmAwards pic.twitter.com/efJhULaI71— Megastar Chiranjeevi™ (@Chiru_FC) August 26, 2023