Waltair Veerayya Review:వాల్తేరు వీరయ్య రివ్యూ
Waltair Veerayya Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా నేడు గ్రాండ్ రిలీజ్ అయింది.. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో మాస్ మెగాస్టార్ ని చూస్తారు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్టుగానే ప్రెసెంట్ చేసారు. ట్రైలర్, సాంగ్స్ కూడా చిరంజీవి మార్క్ ఎంటర్టైన్మెంట్ పక్కా అనే అంచనాలు పెంచాయి. ఎట్టకేలకు ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వీరయ్య వీరంగం సృష్టించాడా లేదా చూద్దాం.
వాల్తేరులోని జాలరి పేటలో ఉండే వాల్తేరు వీరయ్య(మెగాస్టార్ చిరంజీవి) ఆ పేట మొత్తానికి బాస్ లాంటి వాడు. తనకు ఎవరూ లేకపోవడంతో తన పేట వాళ్లే తన వాళ్ళుగా బతుకుతూ ఉంటాడు. డ్రగ్ డీలర్లు కోస్టల్ గార్డులను కిడ్నాప్ చేస్తే… వాళ్ళను తీసుకు రావడానికి నేవీ అధికారులు వీరయ్య సాయం కోరతారు. వీరయ్య వీరత్వం తెలిసి… సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్ర ప్రసాద్) వీరయ్యను కలుస్తాడు. మలేషియాలోని డ్రగ్ డీలర్ సోలొమాన్ (బాబీ సింహా)ను కిడ్నాప్ చేసి ఇండియాకు తీసుకు రావాలని ఆఫర్ చేస్తారు. డీల్ ఓకే చేసి మలేషియా వెళ్ళిన వీరయ్యకు హోటల్ లో పని చేసే అదితి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు. తాను వచ్చింది సోలొమాన్ కోసం కాదని, కాలా అలియాస్ మైఖేల్ సీజర్ (ప్రకాష్ రాజ్) కోసమని చెబుతాడు. ఆఫర్ ఒకటి తీసుకుని మైఖేల్ సీజర్ కోసం ఎందుకొచ్చాడు. అయితే మలేషియాలో డ్రగ్స్ దందాకు వీరయ్యకు లింక్ ఏంటి. ఏసీపీ వివేక్ సాగర్ (రవితేజ)కి, వీరయ్యకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది. క్యాథరీన్ కు చిరంజీవికి మధ్య ఉన్న సంబంధం ఏంటి డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులకు దారి తీసింది.. అనే ప్రశ్నలకు సమాధానం వాల్తేరు వీరయ్య సినిమా ను తెరపై చూడాల్సిందే.
చిరంజీవి పర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాల్తేరు వీరయ్య సినిమా కథ మెగాస్టార్ చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పాలి. ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఎంటర్‌టైనింగ్ సాగుతుంది. రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఉన్నాయి. గతంలో మనం ఎన్నో సినిమాల్లో చూసిన కథని మరోసారి మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు బాబీ. సినిమా ఫస్ట్ ఆఫ్ మొదలైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి ఎంటర్టైన్మెంట్ తో అందరినీ ఆకట్టుకోగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో ప్రేక్షకులందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేశారు. ఇక బాబీ సెకండ్ హాఫ్ లో కూడా తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు. మెగాస్టార్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు అతిధి పాత్రలో హీరోయిన్ శృతిహాసన్ ఎంట్రీ.. ఆమెతో బాస్ లవ్ ట్రాక్ ఇవన్నీ చాలా సరదాగా కూర్చోబెడతాయి.
ఫస్ట్ ఆఫ్ మొత్తం ఆసక్తికరంగా సాగినా సెకండ్ హాఫ్ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ లో .. వీరయ్య ఫ్లాష్ బ్యాక్.. వీరయ్యని సవాల్ చేస్తూ కథలోకి ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్ లో మాస్ రాజా రవితేజ స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇంట్రడక్షన్ బాగుంది. పక్కా తెలంగాణ యాసలో రవితేజ బాడీ లాంగ్వేజ్, డైలాగ్స్ అభిమానులకు జోషునిచ్చాయి. అందరికీ తెలిసిన కథ అయినా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కలిపి చూపించడంతో కొంతవరకు దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చిరంజీవి పాత్ర ఆద్యంతం చాలా ఎంటర్టైనింగ్ గా రూపొందించారు. సినిమా ఆద్యంతం చాలా కామెడీ వేలో చిరు పాత్ర సాగుతూ ఉంటుంది. రవితేజతనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. శృతిహాసన్ కూడా హోటల్లో పనిచేసి రా ఆఫీసర్ గా బాగా ఆకట్టుకుంది.అలాగే బాబీ సింహా, రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్ వారి వారి పరిధుల మేర ప్రేక్షకులను మెప్పించారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు ఎనర్జిటిక్ గా ఉన్నాయి.. కానీ, బాస్ కి ఇంకా బెటర్ సాంగ్స్ పడాల్సింది. బాస్ పార్టీ, పూనకాల లోడింగ్, సాంగ్స్ థియేటర్లలో మోతమోగిస్తున్నాయి. దర్శకుడు బాబీ సినిమా మొత్తాన్ని తనదైన మార్క్ లో తెరకెక్కించారు. దర్శకుడుగా కాకుండా ఒక ఫాన్స్ గా తెరకెక్కించినట్లుంది. సాంగ్స్ కి స్క్రీన్ స్పేస్ కరెక్ట్ గా సరిపోవడంతో థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ రూపొందించిన హార్బర్ సెట్ అందరిని ఆకట్టుకుంది. ఆర్థర్ ఎ. విల్సన్ అందించిన సినిమాటోగ్రఫీ బావుంది. చిరంజీవిని స్క్రీన్ పై కొత్తగా చూపించాడు. ఇక నిర్మాణ విలువలు, ఎడిటింగ్ తో పాటు ఇతర సాంకేతిక వాల్యూస్ కూడా బాగున్నాయి. చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే ‘వీరయ్యవీరంగం’