Waltair Veerayya: ఓవైపు పూనకాలు మరోవైపు వసూళ్లు..వీరయ్య వీరంగం
Waltair Veerayya: సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. సంక్రాంతి హాల్ డేస్ ను వీరయ్య చక్కగా క్యాష్ చేసుకుంటున్నాడు.
రోజుకు పెరుగుతున్న జనాదరణతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ దాటిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. గత మూడు రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇది ఒక సరికొత్త రికార్డ్. అన్ని చోట్లా సాలిడ్ కలెక్షన్లు సాధిస్తోంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటించాడు.
ఇక మూడురోజుల్లోనే ఇంత వసూళ్లు చేసే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు బాబీ ని చిరు ఫాన్స్ ఆకాశానికెత్తేస్తున్నారు. మూడురోజుల్లో వందకోట్లు అంటే మామూలువిషయం కాదు. మరోసారి చిరు మ్యానియా అంటే ఏంటో చెప్పిన చిత్రంగా చరిత్రకెక్కింది. 108cr Gross#Chiranjeevi aa Majaka అంటూ చిరు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. చాలారోజులతర్వాత ఇందులో ఊర మాస్ లెవల్లో చిరంజీవి నటించి అభిమానులను ఫిదా చేసారు.
#WaltairVeerayya 3days
Nizam:16.8cr
Ceeded:9.3cr
Ap: 23+cr
Roi: 4cr+
Overseas: 8cr+ antunnaruTotal 61cr+ share & 108cr Gross#Chiranjeevi aa Majaka🥳🥳#WaltairVeerayya #BlockbusterWaltairVeerayya#SankaranthiMoguduVeerayya #100CrGrosserVeerayya pic.twitter.com/Rng9Mr2WbS
— Waltair Veerayya🔥 (@ChiruIdealActor) January 16, 2023