Mega Star Chirnajeevi: వైజాగ్ లో స్థిరపడతా .. చిరంజీవి
Mega Star Chirnajeevi: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ కి ఇతర రాష్టాలనుండి కూడా అభిమానులు భారీగా తరలివచ్చారు.
అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఇల్లు కట్టుకోవాలని నా చిరకాల కోరిక అని అన్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకుని విశాఖ పౌరుడిని కావాలని అనుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. అన్నట్టుగానే ఇక్కడ బీమిలి వెళ్లే మార్గంలో స్థలం కొనుకున్నానని చెప్పారు. ఈ మాటతో అభిమానులు ఒక్కసారిగా అరుపులు కేకలతో ప్రాంగణం మొత్తం మార్మోగింది. సినిమా టైటిల్ చెప్పగానే బాబి తో ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పానని చిరంజీవి వెల్లడించారు. నా సినిమాలు ఎన్నో విశాఖలో షూటింగ్స్ జరుపుకున్నాయని గుర్తు చేసారు.
తను నా అభిమానిగా వచ్చినా తన పని తీరు చూసి నేను బాబికి అభిమానిని అయిపోయా. ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు గర్వ పడుతున్నా. రవితేజ అంటే నాకు చాలా ఇష్టం. అంచెలంచెలుగా ఎదిగాడు. ‘ఆజ్ కా గుండారాజ్’లో చిన్న వేషం వేశాడు. అప్పట్లో తాను హిందీ మాట్లాడుతుంటే సరదాగా ఉండేది. ఇంత బిజీలోనూ ఈ సినిమాకి కాల్షీట్లు కేటాయించడం సంతోషంగా ఉంది.
ఈ ‘వాల్తేరు వీరయ్య’ బాగా ఆడుతోందన్నారు. బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారన్నారు.. ఒకరు కథకుడు, రెండవ వాడు రచయిత, మూడు స్క్రీన్ ప్లే రైటర్, ఆ తర్వాత డైరెక్టర్ ఇన్ని క్వాలిటీస్ ఉన్న దర్శకుడు బాబీ అని అన్నారు. సంక్రాంతికి డోంట్ స్టాప్ సీయింగ్ ‘వాల్తేరు వీరయ్య’ అంటూ ముగించాడు.