Godfather:మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను మలయాళ మూవీ మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’కు రీమేక్‌గా తెరకెక్కింది.. దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపించడంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపారు. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు చేయడంతో ఈ సినిమా తెలుగు ఆడియెన్స్‌కు బాగానే కనెక్ట్ అయ్యింది. తెలుగు రాష్ట్రాలలో ఈ గాడ్‌ఫాదర్ చిత్రానికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు.
ఇక ఈ సినిమాలో సత్యదేవ్,సముద్రఖని, నయనతారల పర్ఫార్మెన్స్‌లకు తోడుగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్పెషల్ రోల్ కూడా ఆడియెన్స్‌ను థ్రిల్ చేసింది. వీరిద్దరు కలిసిచేసిన డాన్స్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను మరింత కట్టిపడేసింది. మొత్తంగా ‘గాడ్‌ఫాదర్’ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్‌కు మంచి సక్సెస్‌ను అందించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌పాం నెట్‌ఫ్లిక్స్ గాడ్‌ఫాదర్ చిత్ర డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను నవంబర్ 19న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో సంచలనవిజయం అందుకున్న ఈ చిత్రం ఓటీటీ లో ఇలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.