Chandrayaan 3 Movie:భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ చంద్రయాన్ 3 విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ప్రపంచ దేశాలు ఈ ప్రయోగం కౌంట్ చడౌన్ మొదలైన దగ్గరి నుంచి భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూశాయి.
Chandrayaan 3 Movie:భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ చంద్రయాన్ 3 విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. ప్రపంచ దేశాలు ఈ ప్రయోగం కౌంట్ డౌన్ మొదలైన దగ్గరి నుంచి భారత ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా అత్యంత ఆసక్తిగా ఎదురు చూశాయి. ఫైనల్‌గా విక్రమ్ ల్యాండర్ సేఫ్‌గా దక్షిణ దృవంపై ల్యాండ్ కావడంతో 140 కోట్ల మంది భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. చరిత్ర సృష్టించామని దేశ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రదాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత వెనక ఎంతో మంది ఇస్రో శాస్త్ర వేత్తలు, 1000 మంది సిబ్బంది నిర్విరామ కృషి ఉంది. విక్రమ్ ల్యాండర్ దక్షిణ ధృవంపై దిగుతున్న దృశ్యాలు కోట్లాది మందికి ఆనందాన్ని కలిగిస్తే మరి కొంత మంది ఈ ఉద్వేగ క్షణాలని అదే స్థాయిలో ఆస్వాదించారు. అయితే ఈ పూర్తి ఎపిసోడ్‌ని ఓ సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? .చంద్రయాన్ 2 విఫలయత్నం టు చంద్రయాన్ -2 సక్సెస్ వరకు జరిగిన సంఘటనలు, శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న సవాళ్ల నేపథ్యంలో సినిమా తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? అనే చర్చ మొదలైంది.
దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్‌లు చర్చ మొదలు పెట్టారు.అదే జరిగే ఓ అద్భుతం పునఃసృష్టించినట్టే అవుతుంది. అలాంటి ప్రయత్నం బాలీవుడ్‌లో జరగాలని కొంత మంది నెటిజన్‌లు కోరుకుంటున్నారు. మరి `చంద్రయాన్ -3`ని సినిమాగా తీస్తే నటించే హీరో ఎవరు?..ఈ కథకు మొట్టమొదటి ఛాయిస్ ఎవరు అనేదానిపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే చాలా మంది మాత్రం ఈ కథకు కరెక్ట్ హీరో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ అని చెబుతున్నారు.
మరి దీన్ని ఎవరు తెరపైకి తీసుకొస్తారు?..నిర్మించేది ఎవరనేది కూడా చర్చ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అంశాలని కథలుగా ఎంచుకుంటూ ఇటీవల బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు వస్తున్నాయి. అదే కోవలో ఎవరో ఒకరు `చంద్రయాన్ 3`పై సినిమాని కచ్చితంగా చేస్తారని, అందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అక్షయ్ కుమార్ ఇటీవల `మిషన్ మంగల్`లో నటించిన విషయం తెలిసిందే.