Pathaan: ‘పఠాన్’ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీచేసిన సెన్సార్ బోర్డు
Pathaan: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ మూవీని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ చిత్రం నుంచి ఈమధ్య విడుదలైన ‘బేషరమ్ రంగ్’ పాట వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాట పట్ల దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి. ఈ పాటలో దీపికా పదుకొణె వేసుకున్న దుస్తులు, వీరి మధ్య పాటను చిత్రీకరించిన విధానం అభ్యంతరకరంగా ఉందంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి.
ఇక ఈ చిత్రం చుసిన సెన్సార్ బోర్డు సభ్యులు కూడా ఈ సినిమాకు షాక్ ఇచ్చారు. బేషరమ్ రంగ్ అనే వివాదాస్పద పాటకు కనీసం మూడు మార్పులు చేయాలని సీబీఎఫ్ సి కోరింది. సైడ్-పోజ్ లు డ్యాన్స్ మూమెంట్ ల క్లోజప్ షాట్ లను తొలగించాలని సూచించారు. తాజాగా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీచేశారు. మరి కాషాయ రంగు వస్త్రాన్ని తొలగించారా? లేదా మార్చారా లేకుంటే పాటనే లేపేసారా? అనే విషయాన్ని సర్టిఫికెట్ లో పేర్కొనలేదు. 13 కట్స్ వరకు ఆదేశించిన అనంతరం ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.